షంషీర్‌ను పరామర్శించిన నేతలు | - | Sakshi
Sakshi News home page

షంషీర్‌ను పరామర్శించిన నేతలు

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

మార్కాపురం: వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, కొండపి నియోజకవర్గ పరిశీలకుడు డాక్టర్‌ షంషీర్‌ అలీబేగ్‌ తండ్రి ఉస్మాన్‌బేగ్‌ మృతి చెందడంతో ఆయన మృతదేహానికి సోమవారం పలువురు నేతలు నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి నివాళులర్పించి షంషీర్‌ను ఓదార్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, కేపీ కొండారెడ్డి, జంకె వెంకటరెడ్డి, కుందురు నాగార్జునరెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు నాయకులు షంషీర్‌ను ఒదార్చారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో పార్టీ నాయకులు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణా, మాజీ ఏఎంసీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ సలీం, డాక్టర్‌ చప్పళ్ళి కనకదుర్గ, ఉడుముల కోటిరెడ్డి, గౌతంనాగిరెడ్డి, బట్టగిరి తిరుపతిరెడ్డి, ఎన్‌. చంద్రమౌళి, శ్రీనివాసరావు, చాతరాజుపల్లి శ్రీనివాసులు, సిరాజ్‌, మురారి వెంకటేశ్వర్లు, ఉత్తమ్‌, గొలమారి సత్యనారాయణరెడ్డి, బూదాల గురవయ్య, మందటి మహేశ్వరరెడ్డి, పంబి వెంకటరెడ్డి, రంగారెడ్డి, గపూర్‌, నజీర్‌, నల్లబోతుల కొండయ్య, రమణారెడ్డి, గుంటక చెన్నారెడ్డి, గౌస్‌మోహిద్దిన్‌, ధర్మానాయక్‌, తదితరులు నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement