చీమకుర్తి: చీమకుర్తిలోని హరిహర క్షేత్రం 20వ వార్షిక వేడుకలు నేటి నుంచి రెండు రోజుల పాటు జరగనున్నాయి. దానికి సంబంధించిన కరపత్రాలను సోమవారం చీమకుర్తిలోని హరిహర క్షేత్రంలో మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, లక్ష్మీపద్మావతి వేదపండితులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శిద్దా రాఘవరావు మాట్లాడుతూ హరిహర క్షేత్రం నిర్మించి నేటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా వార్షిక వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానిలో భాగంగా రానున్న రెండు రోజుల పాటు ప్రముఖ వేదపండితుల చేతుల మీదుగా హోమాలు, విశేష పూజా కార్యక్రమాలు, అయ్యప్పస్వామి మహా పడిభజన, పూర్ణాహుతి, నగరోత్సవం, హరిహర శాంతి కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని, ప్రసాదాలను స్వీకరించాలని హరిహర క్షేత్రం ఆలయ కమిటీ నిర్వాహక కమిటీ తరఫున విజ్ఞప్తి చేశారు.
20వ వార్షికోత్సవం సందర్భంగా బ్రోచర్ ఆవిష్కరణ
31వ తేదీ నుంచి రెండు రోజుల పాటు వార్షికోత్సవాలు


