రోడ్ టెర్రర్..
ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఇలా.. ప్రమాద వివరాలు 2024 2025 ప్రాణాంతకమైన ఘటనలు 373 320 స్వల్ప,తీవ్ర గాయాలైన ఘటనలు 500 437 మృతులు 390 343 క్షతగాత్రులు 893 905 మొత్తం ప్రమాదాలు 873 757
విషాద ఘటనలు కోకొల్లలు
ట్రావెల్.. హడల్
ఒంగోలు టౌన్: ప్రయాణం సాఫీగా సాగుతోందని భావిస్తున్నంతలోనే విధి వెక్కిరిస్తోంది.. మృత్యువు పలకరిస్తోంది! రహదారుల నిర్మాణంలో లోపాలు, వాహనదారుల నిర్లక్ష్యం, అజాగ్రత్త, నిద్రమత్తు, అతి వేగం.. ఇలా కారణాలు ఏవైనా ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఓ దుర్ఘటనను మరువక ముందే మరో ప్రమాదం సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడల్లా పెద్ద సంఖ్యలో జనం పిట్టల్లా రాలిపోతుండడంతో పదుల సంఖ్యలో కుటుంబాలు విషాదంలో మునిగిపోతున్నాయి. కుటుంబాన్ని పోషించే పెద్ద లేక, చేతికందివచ్చిన కొడుకు పోయి, కళ్ల ముందు తిరగాడే కూతురు దుర్మరణం చెంది కన్నీరు మున్నీరవుతున్న వారెందరో. అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డలు ఏ బస్సు ప్రయాణంలోనో హఠాత్తుగా పేగుతెంచుకొని వెళ్లి పోతే ఆ కుటుంబాలను ఓదార్చలేం. అదో అంతులేని విషాదం.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రహదారులపై నెత్తుటి ధారలు
2024లో 390, 2025లో 343, 2026లో ఇప్పటి వరకు 40 మందికి పైగా మృతి
తీవ్రమైన ఘటనలు మే మాసంలోనే అత్యధికం
కొనకనమిట్ల, కంభం, మార్కాపురంలో వరుసగా ట్రావెల్ బస్సు ప్రమాదాలు
మార్కాపురం ప్రమాదంలో 14 మంది సజీవ దహనం
పెద్దదోర్నాల మండలంలో గడిచిన 7 వారాల్లో ఏడుగురు మృతి


