అండర్ 20 ఫెన్సింగ్ జిల్లా జట్ల ఎంపిక
ఒంగోలు: అండర్ 20 జూనియర్ జిల్లాస్థాయి ఫెన్సింగ్ క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక ఏబీఎం డిగ్రీ కాలేజీ ఆవరణలో నిర్వహించారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 29 నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగే ఏపీ స్టేట్ ఓపెన్ ఫెన్సింగ్ ఇండివిడ్యువల్ ఛాంపియన్‌షిప్‌లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని ఫెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి జి.నవీన్, జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, అసోసియేషన్ జిల్లా చైర్మన్ కోటా మనోహర్ అభినందించారు.
ఎంపికై న క్రీడాకారులు..
ఫాయిల్ విభాగం: కె.ధరహాస్, బి.ఈశ్వర్, కె.బాలనాగసాయి, స్నేహాంజలి
ఈపీ విభాగం: పి.అంబరీష్, కె.జగదీష్ చౌదరి
సాబరే విభాగం: కె.వెంకటసాయి తేజరెడ్డి, టి.అభినవ్ బుద్ద, కె.తారక్‌రాం, పి.చక్రిక, వి.లేఖన, ఈ.మహిత


