ప్రాజెక్టు నిర్మాణం ఇలా...
శ్రీశైలం ప్రాజెక్టులోని 43.58 టీఎంసీల కృష్ణ నీటిని శ్రీశైలం వద్ద ఉన్న కొల్లం వాగు నుంచి 2 టన్నెళ్ల ద్వారా ప్రకాశం, కడప, నెల్లూరు జిల్లాలోని 30 మండలాలకు అందించేలా ప్రాజెక్టును రూపకల్పన చేశారు. వెలిగొండ ప్రాజెక్టుతో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 మంది లక్షల మందికి తాగునీరు అందించేలా డిజైన్ చేశారు. గొట్టిపడియ, సుంకేసుల, కాకర్ల డ్యాంలు పూర్తి కాగా దోర్నాల మండలం కొత్తూరు వద్ద రెండు టన్నెళ్ల పనులు పూర్తయ్యాయి. ఒక్కో టన్నెల్‌ను 18.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. మొదటి టన్నెల్ పనులు పూర్తి చేయగా, రెండో టన్నెల్ పనులు కూడా వేగంగా గత ప్రభుత్వంలో చేపట్టారు.
దివంగత సీఎం వైఎస్సార్ మహా సంకల్పంతో ప్రాజెక్టును ప్రారంభించగా 2014 నాటికి టన్నెల్–1 11.50 కిలోమీటర్లు పూర్తికాగా, టన్నెల్–2 9 కిలోమీటర్లు పూర్తయింది. 62 శాతం టన్నెల్ 1 పనులు పూర్తికాగా, 48 శాతం టన్నెల్ 2 పనులు పూర్తయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు 1వ టన్నెల్‌కు సంబంధించి కేవలం 2 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయంటే ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో అర్థం చేసుకోవచ్చు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రాజెక్టుపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి మొదటి టన్నెల్‌ను పూర్తి చేశారు.


