ప్రేమ, కరుణ, శాంతి సమ్మేళనమే క్రిస్మస్
ఒంగోలు సిటీ: ప్రేమ, శాంతి, కరుణ సమ్మేళనమే క్రిస్మస్ వేడుకని జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. నగరంలోని జెడ్పీ సమావేశం హాలులో కార్యాలయ సిబ్బంది ఆధ్వర్యంలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొని కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరస్పరం ప్రేమ, శాంతితో నడుచుకోవాలన్న ఏసుక్రీస్తు బోధనలను పాటించాలని సూచించారు. ఏసుప్రభు జీవితం మానవాళికి ఒక సందేశమన్నారు. ఏసుప్రభు బోధనలు ప్రేమ, కరుణ, సేవ భావనతో నిండి ఉంటాయని, ప్రతి ఒక్కరూ వాటిని ఆచరించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బాలమ్మ, సిబ్బంది పాల్గొన్నారు.


