క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలకు చేరుకోండి
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
తాళ్లూరు: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. మండలంలోని బొద్దికూరపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం బూచేపల్లి వెంకాయమ్మ, సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ మెటీరియల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు వెచ్చించారన్నారు. అమ్మఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాలకు నగదు జమ చేసి విద్యను ప్రోత్సహించారని తెలిపారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ తానూ ఇదే గ్రామంలోని పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకొని బాగా చదివి వారికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్ని స్కూల్ బ్యాగ్‌లు చినిగిపోయాయని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అడగ్గా.. 90 శాతం మంది విద్యార్థులు చేతులెత్తారు. దీంతో తమ చారిటబుల్ ట్రస్టు తరఫున విద్యార్థులందరికీ బ్యాగ్‌లు అందిస్తామని తెలిపారు. పాఠశాలలో మరమ్మతులకు గురైన వాటర్‌ప్లాంట్, మరుగుదొడ్లు బాగు చేయిస్తామని, టైనింగ్ హాల్‌కు, ప్రైమరీ స్కూల్ ప్రహరీ నిర్మాణానికి విరాళాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మందా శాంసన్, ఉప సర్పంచ్ పులి ప్రసాద్రెడ్డి, వెలుగువారిపాలెం సర్పంచ్ ముచ్చుమారి కోటేశ్వరమ్మ బ్రహ్మారెడ్డి, ఎంపీటీసీ బాలకోటయ్య, నాయకులు పులి అంజిరెడ్డి, పులి రామిరెడ్డి, సగిలి రోషిరెడ్డి, పులి ప్రభాకర్రెడ్డి, ఎదులూరి కృష్ణారెడ్డి, ఎదురూరి శ్రీనివాస్రెడ్డి, పులి సుబ్బారెడ్డి, పాఠశాల హెచ్‌ఎం పి.సుబ్బారావు, పీడీ రవిప్రసాద్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


