రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెద్దారవీడు: జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పెద్దారవీడు మండలం పరిధిలోని తోకపల్లి గ్రామ సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. తీవ్ర గాయాలతో హైవేపై పడి ఉన్న వ్యక్తిని అటుగా వెళ్తున్న వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హైవే పెట్రోలింగ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 అంబులెన్స్‌లో క్షతగాత్రుడిని మార్కాపురం జీజీహెచ్‌కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121102186ను సంప్రదించాలని ఎస్సై సాంబశివయ్య కోరారు.
మార్కాపురం రూరల్ (మార్కాపురం): మార్కాపురం పట్టణ శివారులోని చెన్నరాయునిపల్లి వద్ద వీధి శునకాల దాడిలో సుమారు 20 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. అందిన వివరాల మేరకు.. మంగళవారం రాత్రి చిన్నరాజయ్యకు చెందిన 7 గొర్రెలు, బుధవారం సాయంత్రం చిన్నమల్లయ్యకు చెందిన 13 గొర్రెలను వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. ఒక్కో గొర్రె సుమారు 10 వేల రూపాయలు ఖరీదు చేస్తుందని, కుక్కల బెడదతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వీధి శునకాలను కట్టడి చేయాలని కోరారు.
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి


