ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
● ఇద్దరికి గాయాలు
పొదిలి రూరల్: ఎదురెదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి పొది లి మండలంలోని తలమళ్ల–అగ్రహారం మధ్య ఒంగోలు–కర్నూలు రహదారిపై జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం..మండలంలోని ఏలూరు పంచాయతీ టి.సల్లూరు గ్రామానికి చెందిన వారు పొదిలి నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అదే విధంగా కొమరోలు మండలం అల్లినగరానికి చెందిన నాగరాజు ఒంగోలు నుంచి బైక్‌పై స్వగ్రామానికి వెళుతుండగా తల్లమల–అగ్రహారం కోల్డ్ స్టోరేజీ సమీపంలో ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ప్రమాదంలో నాగరాజు(27) అక్కడికక్కడే మృతి చెందగా, మరో బైక్‌పై వెళుతున్న భార్యభర్తలు కోటేశ్వరరావు, రోజాలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ద్విచక్రవాహనాలు ఢీకొని వ్యక్తి మృతి


