జిల్లా ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలి
● కలెక్టర్ రాజాబాబు ఆదేశం
ఒంగోలు సబర్బన్: అన్ని ప్రభుత్వ విభాగాల నుంచి జిల్లా ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ పీ రాజాబాబు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17, 18 తేదీల్లో రాజధానిలో జరగనున్న కలెక్టర్ల సమీక్ష సమావేశానికి అవసరమైన ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలన్నారు. అవసరమైన నివేదికల గురించి జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు అభివృద్ధి పనులు, పునరావాస కేంద్రాల వివరాలను సమగ్రంగా ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆగస్టు నుంచి అమలవుతున్న సీ్త్ర శక్తి పథకం గురించి ప్రతిస్పందన నివేదికలు తయారు చేయాలని చెప్పారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, గనులశాఖ డీడీ రాజశేఖర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ కట్టా వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు పాల్గొన్నారు.


