సమస్యలతో పోటెత్తిన అర్జీదారులు
ఒంగోలు సబర్బన్:
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు పోటెత్తారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 264 మంది అర్జీలు అందజేశారు.
ఇంత వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. గతంలో పనిచేసిన కలెక్టర్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా ప్రయోజనాంలేదన్నారు. మంచినీటికి పైపులైన్ ఏర్పాటు చేసి కాలనీ ప్రజల దాహార్తిని తీర్చాలన్నారు.
అర్జీలు నిర్ణీత గడువు లోగా
పరిష్కరించాలి
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పరిష్కారించేలా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలస్వతం ఉండరాదన్నారు. సమస్యల పరిష్కారం కోసం అధికారుల వద్దకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, కుమార్, జాన్సన్, కళావతి, విజయజ్యోతి పాల్గొన్నారు.


