జనకోటి గర్జన
ప్రభుత్వ మెడికల్ కాలేజీలప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసన గళం పీపీపీ నిర్ణయాన్ని చంద్రబాబు వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలు వైఎస్సార్ సీపీ కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వైఎస్సార్ సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై హోరెత్తిన నినాదాలు కోటి సంతకాల ప్రతులు కేంద్ర కార్యాలయానికి తరలింపు ఒంగోలు చర్చి సెంటర్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ
ప్రైవేటుపై
మాజీ ఎమ్మెల్యే జంకెకి అస్వస్థత
ఒంగోలు చర్చి సెంటర్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా
నినదిస్తున్న వేలాది మంది వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు
పేద ప్రజలకు వైద్యసేవలు, వైద్య విద్యను దూరం చేసేలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. వైఎస్సార్ సీపీ నేతృత్వంలో చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో స్వచ్ఛందంగా భాగస్వాములైన ప్రజలు సర్కారు తీరుపై తమ నిరసన గళం వినిపించారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన సంతకాలను ఒంగోలు నుంచి తాడేపల్లికి తరలించే కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వేలాది మంది ప్రజలు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. పీపీపీని నిరసిస్తూ చంద్రబాబు వైఖరిని దుమ్మెత్తిపోశారు.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
పేదల సంక్షేమం పట్టని చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో సొంత వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలను మానుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను ఒంగోలుకు తరలించారు. ఆ ప్రతులను తాడేపల్లికి తరలించే కార్యక్రమంలో భాగంగా సోమవారం నగరంలోని చర్చి సెంటర్ నుంచి వైఎస్సార్ సీపీ కార్యాలయం వరకు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి సెంటర్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిరుపేద సామాన్య ప్రజలకు వైద్య సేవలను ఉచితంగా అందించాలన్న సదుద్దేశంతో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి 17 మెడికల్ కళాశాలల నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. విద్య, వైద్యం ప్రజల ప్రాథమిక హక్కు అని, అందుకే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ రంగం ద్వారానే మెడికల్ కాలేజీలు నిర్వహించడానికి పూనుకున్నారన్నారు. అందుకు విరుద్ధంగా చంద్రబాబు మెడికల్ కాలేజీలను సొంత వ్యక్తులకు పప్పు బెల్లంలా పంచిపెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలన్నింటినీ అటకెక్కించారని, సూపర్‌సిక్స్ పథకాల ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదన్నారు. పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలోని 99 శాతం ప్రజలకు మేలు చేసే పథకాలను పక్కనబెట్టేసి కేవలం 99 పైసలకే ప్రభుత్వ భూమిని కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు కబంద హస్తాల నుంచి కాపాడుకోవడానికి జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో 5,26,148 మంది సంతకాలు చేశారని తెలిపారు. ప్రైవేటు మెడికల్ కళాశాలలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు కళ్లు తెరిచి మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా మెడికల్ కళాశాలలను నిర్మించి నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ప్రజా పోరాటాలను కొనసాగిస్తామన్నారు. ఇదే స్ఫూర్తిని నాయకులు, కార్యకర్తలు కొనసాగించాలని, జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది, మెడికల్ కళాశాలలను మంజూరు చేసింది జగనన్నే అని చెప్పారు. భవిష్యత్‌లో జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధికి పూర్తిస్థాయిలో అండగా నిలబడతామని తెలిపారు.
సంక్షేమం జగన్‌తో సాధ్యం:
జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో సంక్షేమ పథకాలను వంద శాతం అమలు చేసిన ఘనత జగనన్నకే దక్కిందని చెప్పారు. ఆరోగ్య శ్రీ, వసతిదీవెన, విద్యాదీవెన, అమ్మ ఒడి, వంటి సంక్షేమ పథకాలను నూటికి నూరు శాతం అమలు చేసి దమ్మున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరూపించుకున్నారన్నారని చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల ఆకాంక్షల మేరకు జగనన్నను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు అహర్నిశలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పేదలకు వైద్యం దూరం చేసేందుకు బాబు కుట్రలు:
యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించడానికి నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నిస్తే పేదలకు వైద్యాన్ని దూరం చేయడానికి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర బడ్జెట్‌లో మెడికల్ కళాశాలల నిర్మాణం కోసం కేవలం రూ.ఐదు వేల కోట్లు కేటాయించడానికి చంద్రబాబుకు చేతకావడం లేదని ఎద్దేవా చేశారు. పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం, మెరుగైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురాడం జగనన్న ఏకై క లక్ష్యం అన్నారు.
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి:
ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జగనన్న పీపుల్స్ లీడరైతే చంద్రబాబు పేపరు లీడర్ అని అన్నారు. జగనన్న ఐదేళ్ల పాలనలో క్షేత్రస్థాయి నుంచి గ్రామాలను అభివృద్ధి బాట పట్టించారని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు నిస్పక్షపాతంగా సంక్షేమ పథకాలు అందించారని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచ్చిన ఏకై క ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని చెప్పారు. ఏకకాలంలో 17 మెడికల్ కళాశాలలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎక్కడా లేరన్నారు. జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని తేల్చిచెప్పారు.
చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి..
మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని చెప్పారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను రాష్ట్రంలోని ప్రజలంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, చంద్రబాబు ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందని, పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకొని సామాన్య ప్రజలను వేధిస్తున్నారని విమర్శించారు.
వైద్య సేవలందక ప్రాణాలు పోతున్నాయ్..
మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం ప్రజలు సరైన వైద్య సౌకర్యాలు లేక అల్లాడిపోతున్నారని చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పక్షవాతం లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్, గుంటూరు వంటి దూరం ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని, దాంతో కాలయాపన జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకొని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్కాపురంలో మెడికల్ కళాశాల మంజూరు చేశారని చెప్పారు. పశ్చిమ ప్రకాశం ప్రజల ఆరోగ్యాన్ని లెక్క చేయని చంద్రబాబు ప్రభుత్వం ఈ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పి వ్యాపారం చేసుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటన్నారు.
గిద్దలూరు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ కేపీ నాగార్జునరెడ్డి మాట్లాడుతూ జగనన్న పాలనలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా సమానంగా చేపట్టారన్నారు. నాడు–నేడు తో స్కూళ్లు, ఆస్పత్రులు బాగుపడ్డాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ఉద్యోగులకు జీతాలు సక్రమంగా రావడంలేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిలిచిపోయిందని చెప్పారు. ఏవిధంగా చూసినా రాష్ట్రంలోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.
ఒంగోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని సామాన్య ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదనే ఉందన్నారు. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలి ప్రైవేటీకరణ పేరుతో సొంత వ్యక్తులకు సంపదను దోచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ 18 నెలల చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని ప్రజలు కష్టనష్టాలకు గురవుతున్నారని చెప్పారు. ప్రజల సంపదను సొంతవ్యక్తులకు కట్టబెట్టడమే చంద్రబాబు విజన్ అని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రి చేయడానికి ఇప్పటి నుంచే ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున బాపట్ల జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు కూడా కావడంతో ఆయన బాపట్లలో నిర్వహించిన కార్యక్రమానికి మద్దిపాడు నుంచి ర్యాలీగా తరలివెళ్లారు.
కార్యక్రమంలో మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ మాదాసి వెంకయ్య, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షులు కుప్పం ప్రసాద్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఉడుముల శ్రీనివాసరెడ్డి, కసుకుర్తి ఆదెన్న, మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ వైఎం.ప్రసాద్‌రెడ్డి, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు నగరికంటి శ్రీనివాసరావు, లీగల్ సెల్ నాయకులు హరిబాబు, హిదయతుల్లా, కే స్వామిరెడ్డి, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, చీమకుర్తి జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ ఇమ్రాన్‌ఖాన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, గౌడ విభాగం జిల్లా అధ్యక్షుడు తాత నరసింహగౌడ్, జిల్లా కార్యదర్శి సయ్యద్ అప్సర్‌బేగం, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు దామరాజు క్రాంతికుమార్, జిల్లాలోని అన్ని వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కోఆప్షన్ మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలి
జనకోటి గర్జన
జనకోటి గర్జన
జనకోటి గర్జన


