జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని

Dec 16 2025 4:18 AM | Updated on Dec 16 2025 4:18 AM

జాతీయ

జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని

జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని అమరజీవికి ఘనంగా నివాళులు సేవాదృక్పథం పెంపొందించడమే స్కౌట్‌ లక్ష్యం 4 నుంచి జాతీయ స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌

మద్దిపాడు: మండల కేంద్రం మద్దిపాడులోని కడియాల యానాదయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎం.అను జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల పీడీలు వనజ, సౌజన్య తెలిపారు. ఈనెల 11, 12, 13వ తేదీల్లో నెల్లూరు జిల్లాలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్‌ 17 బాలికల హాకీ టోర్నమెంట్‌లో అను మంచి ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించుకుంది. ఆమె త్వరలో జార్ఖండ్‌ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో జరిగే జాతీయ పోటీల్లో ఆడనుంది. ఎంపికై న విద్యార్థిని అను ను పీడీలు వనజ, సౌజన్యలను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాల్యాద్రి, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు.

ఒంగోలు సబర్బన్‌: అమరజీవి పొట్టిశ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌ గోపాల కృష్ణ కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్లో ఘనంగా నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు తెలుగుజాతికి చేసిన సేవలను కొనియాడారు. ఆయన ప్రాణత్యాగంతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడిందని, యావత్‌ తెలుగుజాతికి పొట్టిశ్రీరాములు నిత్యస్మరణీయులని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ చిన ఓబులేసు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు శ్రీధర్‌ రెడ్డి, కుమార్‌, జాన్సన్‌, మాధురి, విజయజ్యోతి, జిల్లా పరిషత్‌ సీఈఓ చిరంజీవి, డీపీఓ ముప్పూరి వెంకటేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ఒంగోలు సిటీ: విద్యార్థుల్లో సేవాదృక్పథం, దేశభక్తి పెంపొందించడమే స్కౌట్‌ లక్ష్యమని ఎంఈఓ తిరుపతి కిషోర్‌బాబు అన్నారు. భారత్‌ గౌడ్స్‌ అండ్‌ గైడ్స్‌ సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలోని పీఎం శ్రీ పాఠశాలలకు సంబంధించిన స్కౌట్‌ మాస్టర్లకు 7 రోజుల శిక్షణ తరగతులు ఒంగోలు నగరంలోని డీఆర్‌ఆర్‌యం హైస్కూల్‌లో సోమవారం ప్రారంభించారు. ఈ శిక్షణ 21వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఒంగోలు ఎంఈఓ తిరుపతి కిషోర్‌ బాబు మాట్లాడుతూ భారత్‌ గౌడ్స్‌ అండ్‌ గైడ్స్‌ ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించవచ్చన్నారు. భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ జిల్లా అసోసియేషన్‌ కార్యదర్శి తన్నీరు బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 51 పీఎం శ్రీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బేసిక్‌, అడ్వాన్స్‌డ్‌ స్కౌట్‌ శిక్షణ ఇస్తారన్నారు. కార్యక్రమంలో ఎంఈఓలు వెంకటారెడ్డి, సుబ్బయ్య, డోల శ్రీను, అల్లూరి హైస్కూల్‌ హెచ్‌ఎం సుబ్బారావు, డీఎల్‌ నారాయణ, జిల్లా ట్రెజరర్‌ వెంకట్రావు, కేవీ శేషారావు, పీ వెంకట్‌ రెడ్డి, బ్రహ్మేశ్వర రావు, శ్రీనివాసరావు, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

కంభం: కంభం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మార్కాపురం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జనవరి 4 నుంచి 18వ తేదీ వరకు జాతీయ స్థాయి లెదర్‌ బాల్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గెలిచిన వారికి ప్రథమ బహుమతి రూ.2 లక్షలు, ద్వితీయ బహుమతి కింద రూ.లక్ష అందిస్తారన్నారు. ప్రతి మ్యాచ్‌ కు మ్యాన్‌ఆఫ్‌ ది మ్యాచ్‌, మ్యాన్‌ ఆఫ్‌ది సిరీస్‌, బెస్ట్‌ బౌలర్‌, బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ అవార్డులు, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారన్నారు. డిసెంబర్‌ 30వ తేదీలోగా ఎంట్రీ ఫీజు రూ.6 వేలు చెల్లించి తమ జట్టు పేరు నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు 9440255999, 9295555990, 9849377383 నంబర్లను సంప్రదించాలన్నారు.

జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని 1
1/2

జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని

జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని 2
2/2

జాతీయ స్థాయి హాకీ పోటీలకు మద్దిపాడు విద్యార్థిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement