రాష్ట్ర స్థాయి జూడో పోటీలకు క్రీడాకారులు ఎంపిక
ఒంగోలు: రాష్ట్ర స్థాయి జూడో క్యాడెట్, జూనియర్స్ క్రీడాకారుల ఎంపిక ఆదివారం స్థానిక రాజీవ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూలులో నిర్వహించారు. సుమారు 50 మంది క్రీడాకారులు జిల్లావ్యాప్తంగా ఈ ఎంపికకు హాజరయ్యారు. ఎంపికై న వారిలో ఎం.లక్ష్మీ ప్రదీప్, కె.లక్ష్మి నిశాంత్, డి.రవీంద్ర, సీహెచ్ నాగకోమల్, షేక్ సాజల్ మీర్జా, డి.నరేంద్ర, ఆర్.రామ్‌చరణ్, ఎన్.అమరేశ్వరరెడ్డి ఉన్నారు. వీరిని అసోసియేషన్ రాష్ట్ర డిసిప్లీనరీ కమిటీ చైర్మన్ షేక్ ఖాజా మస్తాన్ అభినందించారు. ఎంపికై న వీరు ఈనెల 19 నుంచి 22 వరకు కర్నూల్‌లో జరిగే రాష్ట్రస్థాయి క్యాడెట్, జూనియర్స్ టోర్నమెంట్‌లో పాల్గొంటారని ప్రధాన కార్యదర్శి ఎ.రవి తెలిపారు.


