జాతీయ తైక్వాండో పోటీలకు ఒంగోలు విద్యార్థులు
ఒంగోలు: జాతీయ తైక్వాండో పోటీలకు ఒంగోలు విద్యార్థుల ఎంపిక హర్షణీయమని ఆల్ ఇండియా పోర్ట్ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ ఫెడరేషన్ ఏపీ చైర్మన్ షేక్ ఖలీఫాతుల్లాభాషా అన్నారు. స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం క్లబ్ ఆవరణలో ఆదివారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అంతర్జాతీయ తైక్వాండో 5వ డాన్ కోచ్ షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఎంపికలో 20 మంది అర్హత సాధించారు. ఎంపికై న వారంతా జాతీయ పోటీలో సత్తాచాటి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థులను ఖలీఫాతుల్లాబాషాతోపాటు సీవీఎన్ పాలకవర్గం సభ్యులు రామిరెడ్డి నితిన్‌రెడ్డి, కోడూరి రాధాకృష్ణ, శ్రీచక్రవర్తి తదితరులు అభినందించారు.


