మద్యం మత్తులో అత్తపై అల్లుడు దాడి
యర్రగొండపాలెం: పూటుగా మద్యం సేవించి అత్తపై కత్తితో అల్లుడు దాడి చేసిన సంఘటన మండలంలోని మిట్టమీదిపల్లె గ్రామంలో ఆదివారం జరిగింది. పాతకక్షల కారణంగా నారాయణ మద్యం సేవించి అత్త రవణమ్మ ఇంటి వద్దకు వెళ్లాడు. అక్కడ ఘర్షణపడి తన వద్ద ఉన్న కత్తితో ఆమైపె దాడి చేసి గొంతుకోసేందుకు ప్రయత్నించాడు. ఈ సంఘటనలో రవణమ్మ గొంతుపై తీవ్రంగా గాయమైంది. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.చౌడయ్య తెలిపారు.


