12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి
● బీటీఏ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు డిమాండ్
ఒంగోలు సిటీ: 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు డిమాండ్ చేశారు. బీటీఏ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకట్రావు మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ప్రకటించాల్సిన పీఆర్‌సీని జాప్యం చేయడం వలన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు మెడబలిమి ముసలయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, డీఏ బకాయిలు, నాలుగు సంవత్సరాల క్రితం పెట్టిన సరెండర్ లీవులు ఇంతవరకు మంజూరు కాలేదని, వెంటనే మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏల్చూరు మాధవరావు, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కల్లగుంట మోహన్‌రావు, రాష్ట్ర నాయకులు డి.మాల్యాద్రి ఎల్.ఆంటోనీ, కట్టా రమేష్, మందిరాల శరత్ చంద్రబాబు, పారాబత్తెన జాలరామయ్య, చల్లా నరసింహారావు, సీహెచ్ చిన్న వెంగయ్య, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఏకగ్రీవంగా జిల్లా కార్యవర్గం ఎన్నిక...
సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా గౌరవాధ్యక్షునిగా పారాబత్తెన జాలరామయ్య, అధ్యక్షునిగా షేక్ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శిగా కర్ర దేవసహాయం, అసోసియేట్ అధ్యక్షునిగా ఏల్చూరు మాధవరావు, కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఎద్దు శ్రీను, కోశాధికారిగా పల్లె కృష్ణమూర్తి, ప్రచార కార్యదర్శిగా కొండమూరి కొండలరాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నూకతోటి కుమారస్వామి, ఆడిట్ సెక్రటరీగా పల్లె తిరుపతిస్వామి, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కల్లగుంట యలమందరావు, అడిషనల్ జనరల్ సెక్రటరీగా పీక బాబూరావు, మహిళా కార్యదర్శిగా వేల్చూరు భాగ్యం, మరికొందరు రాష్ట్ర కౌన్సిలర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.


