రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం
● వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ధ్వజం
కంభం: రాష్ట్రంలో అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల ధ్వజమెత్తారు. కంభం మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి నెమలిదిన్నె చెన్నారెడ్డి అక్రమ అరెస్టుపై యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డితో కలిసి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌పీ బస్టాండ్ సమీపంలో వైఎస్సార్ విగ్రహం వద్ద ఆదివారం శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారన్నారు. చెన్నారెడ్డి కుటుంబానికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎటువంటి దాడి చేయకపోయినా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దుర్మార్గమని యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. జగనన్న ఇలాంటి కేసులను గమనిస్తున్నారని, యువత ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భవిష్యత్‌లో చంద్రబాబు ప్రభుత్వం, పాలకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.


