విమానాల రన్‌వేకు మరమ్మతులు
సింగరాయకొండ: కేంద్ర ప్రభుత్వ నిధులు సుమారు రూ.80 కోట్లతో నిర్మించిన విమానాల రన్‌వే పనులు నాసిరకంగా జరగటంతో రన్‌వేపై గుంతలు పడి తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన జాతీయ రహదారి అధికారులు రన్‌వేపై శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. గతంలో రన్‌వేపై గుంతలు పడిన ప్రాంతాలను తారుతో సరిచేసేవారు. ఆ తరువాత కురిసిన వర్షాలకు తారు లేచిపోయి మళ్లీ గుంతలు పడ్డాయి. వాహనదారుల నుంచి విమర్శలు రావటంతో ఎట్టకేలకు రన్‌వేపై గుంతలు పడిన ప్రాంతాన్ని పూర్తిగా తొలగించి సిమెంటు కాంక్రీట్‌తో నాణ్యంగా గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. గతంలో ఈ గుంతల వద్ద నిదానంగా వెళ్లాల్సి వచ్చేదని, రాత్రివేళల్లో గుర్తించకపోతే ప్రమాదాలు జరిగేవని, ఇక ఆ సమస్య ఉండదని వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


