ప్రైవేటుపరం చేస్తే వైద్యసేవలు కష్టమే
మెడికల్ కాలేజీని, జీజీహెచ్ వైద్యశాలను కూడా ప్రైవేటుపరం చేస్తే పేద ప్రజలకు చాలా కష్టం. ప్రభుత్వాలు ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందించాల్సిన బాధ్యత ఉంది. బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోకూడదు. పశ్చిమ ప్రకాశంలో గిరిజనులు, దళితులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారికి అత్యవసరమైతే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి ఫీజులు చెల్లించి వైద్యసేవలు ఎలా పొందుతారో అర్థం కావడం లేదు. వైద్యశాలను ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రజాగ్రహాన్ని ఇప్పటికై నా గుర్తించి పీపీపీని రద్దుచేయాలి.
– పత్తి రవిచంద్ర, వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి, మార్కాపురం


