పది కిలోల అడవి పంది మాంసం స్వాధీనం
మార్కాపురం: పెద్దారవీడు మండలం సానికవరం సమీపంలో అడవి పంది మాంసాన్ని అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి పది కిలోలు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం డీఆర్‌ఓ నాగరాజు గౌడ్ తెలిపారు. సానికవరం సమీపంలో ఒక ఫామ్ హౌస్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న రేగుమానిపల్లికి చెందిన పి.దేవసహాయం పొలానికి పందులు రాకుండా విద్యుత్ కంచె వేశాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా విద్యుత్ షాక్‌కు గురై అడవి పంది మృతి చెంది ఉండటాన్ని గుర్తించాడు. అనంతరం పది కిలోల మాంసాన్ని అమ్మకానికి పెట్టాడు. సమాచారం అందుకున్న డీఆర్‌ఓ నాగరాజు గౌడ్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి మాంసాన్ని స్వాధీనం చేసుకుని ఆయన్ను అరెస్టు చేశారు. దాడిలో ఫారెస్టు బీట్ ఆఫీసర్ రవికుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, శివరామరాజు, స్నేక్ క్యాచర్ నిరంజన్ పాల్గొన్నారు.
● ఒకరికి తీవ్ర గాయాలు
కొండపి: అదుపుతప్పి వాహనం బోల్తా పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని పెద్దకండ్లగుంట–కొండపి గ్రామాల మధ్య మలుపు వద్ద శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక టెంట్ హౌస్‌కు సంబంధించిన అశోక్ లేలాండ్ వాహనం పెద్దకండ్లగుంట నుంచి కొండపి వైపు వేగంగా వస్తోంది. డ్రైవర్ వేగాన్ని నియంత్రించే క్రమంలో వాహనం అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న పొలాల్లోకి పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి చెట్టును ఢీకొని ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్‌కు గాయాలవడంతో స్థానిక ఓ ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి చికిత్స అందించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలులోని ఓ ప్రైవేట్ హాస్పటల్‌కు తరలించారు.
మార్కాపురం: పట్టణంలోని అయ్యప్పస్వామి గుడివద్ద శనివారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం జరిగిందని యజమాని కోటిరెడ్డి తెలిపారు. వెంటనే అప్రమత్తమై మంటలార్పినట్ల తెలిపారు. ఈ ప్రమాదంలో కిరాణాషాపులో ఉన్న పలు వస్తువులు కొద్దిగా దగ్ధమయ్యాయి.
పది కిలోల అడవి పంది మాంసం స్వాధీనం


