అండర్–12 జిల్లా క్రికెట్ జట్టు ఎంపిక
ఒంగోలు: అండర్–12 జిల్లా క్రికెట్ జట్టును శనివారం స్థానిక మంగమూరు రోడ్డులోని అసోసియేషన్ సబ్‌సెంటర్స్‌లో ఎంపిక చేశారు. ఈ ఎంపికకు జిల్లావ్యాప్తంగా 80 మంది హాజరయ్యారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు 30 మందిని ప్రాబబుల్స్‌గా ఎంపిక చేసినట్లు ప్రకాశం జిల్లా క్రికెట్ అసో సియేషన్ కార్యదర్శి కారుసాల నాగేశ్వరరావు తెలిపా రు. ప్రాథమికంగా ఎంపికై న వారికి కొరిశపాడు మండలం రావినూతల క్రికెట్ గ్రౌండులో కీపింగ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ వంటి అన్ని విభాగాలలో ప్రతిభా పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మందితో తుది జట్టును ప్రకటిస్తామన్నారు. ఎంపికై న జట్టు జనవరిలో జరిగే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలలో ప్రకాశం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించాల్సి ఉంటుందన్నారు. ఎంపిక ప్రక్రియను ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు నవీన్‌కుమార్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరావు, కోశాధికారి హనుమంతరావు, సభ్యుడు బలరాం పర్యవేక్షించారు. ఎంపిక ప్రక్రియకు సెలెక్టర్లుగా బి.చంద్రశేఖర్, లెఫ్ట్ శ్రీను, బాబూరావు, శివనాగేశ్వరరావు వ్యవహరించారు.


