నవోదయ ప్రవేశ పరీక్షకు 3504 మంది హాజరు | - | Sakshi
Sakshi News home page

నవోదయ ప్రవేశ పరీక్షకు 3504 మంది హాజరు

Dec 14 2025 12:07 PM | Updated on Dec 14 2025 12:07 PM

నవోదయ

నవోదయ ప్రవేశ పరీక్షకు 3504 మంది హాజరు

నవోదయ ప్రవేశ పరీక్షకు 3504 మంది హాజరు 117 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపిక పదో తరగతికి వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో జట్ల ఎంపిక

ఒంగోలు సిటీ: జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశ పరీక్షకు 3504 మంది విద్యార్థులు హాజరైనట్లు జవహర్‌ నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్‌ సి.శివరామ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ నవోదయ ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 25 కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించినట్లు చెప్పారు. ఈ పరీక్షకు మొత్తం 5502 మంది విద్యార్థులకు గాను, 3504 మంది హాజరుకాగా, 1998 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ హైస్కూల్స్‌లో 117 మంది అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ ను ఎంపిక చేసినట్లు డీఈఓ సీవీ రేణుక శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఎంపికై న వారి జాబితాను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. ఎంపికై న వారందరూ ఈ నెల 15వ తేదీ వారికి కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరాల్సిందిగా కోరారు. సంబంధిత మండల విద్యాశాఖాధికారి, ప్రధానోపాధ్యాయులు ప్రతి నెలా 2వ తేదీ వారి పరిధిలో పనిచేస్తున్న అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌ వారి డ్యూటీ సర్టిఫికెట్‌ ను సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ ఒంగోలు వారికి సమర్పించాలని కోరారు.

● ప్రతి పాఠశాలలో జీఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాన్ని అమలు చేయాలి

● పాఠశాల విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ సుబ్బారెడ్డి

ఒంగోలు సబర్బన్‌: పదో తరగతి వంద రోజుల యాక్షన్‌ ప్లాన్‌ సక్రమంగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ ఏ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో శనివారం ఒంగోలు, కొండపి, సంతనూతలపాడు నియోజకవర్గాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలతో సమావేశమయ్యారు. సమావేశంలో జీఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం అన్ని ప్రాథమిక పాఠశాలల్లో సక్రమంగా జరగాలని చెప్పారు. ప్రతిరోజు పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి వారి మార్కులను మరుసటి రోజున లీప్‌ అప్‌లో అప్లోడ్‌ చేయాలని చెప్పారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి నూరు శాతం ఉత్తీర్ణులయ్యేటట్లు చూడాలన్నారు. గత సంవత్సరం కంటే మార్కులు ఎక్కువ వచ్చేలాగా విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో ఒంగోలు ఉప విద్యాశాఖ అధికారి ఏ చంద్రమౌళీశ్వర్‌, డీసీఈబీ సెక్రెటరీ మర్రిబోయిన శ్రీనివాసులు, ఒంగోలు ఎంఈఓ టీ కిషోర్‌ బాబు, ఏఎంఓ పీ నాగేంద్ర నాయక్‌ పాల్గొన్నారు.

జె.పంగులూరు: మండల పరిధిలోని స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి, బాచిన నారాయణమ్మ జూనియర్‌ కళాశాలలో శనివారం ఉమ్మడి ప్రకాశం జిల్లా బాలురు, పురుషులు ఖోఖో జట్ల ఎంపిక నిర్వహించారు. ఈ ఎంపికలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి బాలురు, పురుషుల క్రీడాకారులు 150 మంది పాల్గొన్నట్లు సెలక్టర్లు తెలిపారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లో స్థానిక మాగుంట సుబ్బరామిరెడ్డి జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ బాల, బాలికల రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు జరగనున్నట్లు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడలో ఈ నెల 24, 25, 26 నుంచి రాష్ట్ర స్థాయి సీ్త్ర పురుషుల ఖోఖో పోటీలు నిర్వహిస్తారన్నారు. క్రీడాకారుల ఎంపికలో ప్రకాశం జిల్లా ఖోఖో అసోసియేషన్‌ అధ్యక్షుడు వసంత రఘుబాబు, ఉపాధ్యక్షుడు మండవ సౌజన్య, జాయింట్‌ సెక్రటరీ వై శ్రీనివాసరెడ్డి పాల్గొని జట్లను ఎంపిక చేసినట్లు ఖోఖో సమైఖ్య ఉపాధ్యక్షులు తెలిపారు.

నవోదయ ప్రవేశ పరీక్షకు 3504 మంది హాజరు 1
1/1

నవోదయ ప్రవేశ పరీక్షకు 3504 మంది హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement