వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బ్రహ్మానంద
ఒంగోలు సిటీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా జిల్లాలోని దర్శి నియోజకవర్గానికి చెందిన సుంకర బ్రహ్మానందరెడ్డిని నియమించారు. ఆమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఒంగోలు వన్‌టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ఒంగోలు హెచ్‌సీఎం కళాశాల ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి, కోలాస్ హోటల్ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి కలెక్టర్ రాజాబాబు పూల మాలలు వేస్తారని జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్ ఎన్ లక్ష్మానాయక్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజలు హాజరు కావాల్సిందిగా కోరారు.
ఒంగోలు సిటీ: ఆంధ్రకేసరి యూనివర్సిటీలో మొదటి సారిగా ప్రీ పీహెచ్‌డీ పరీక్షలను యూనివర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ యూనివర్సిటీలో మొత్తం 11 డిపార్టుమెంట్లు ఉన్నాయి. అందులో 52 మంది స్కాలర్స్‌కు పరీక్షలు నిర్వహించగా 50 మంది హాజరయ్యారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డీవీఆర్ మూర్తి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు ఆదేశాల మేరకు పరీక్షలు నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలమణి తెలిపారు. ప్రీ పీహెచ్‌డీ పరీక్షలను ప్రొఫెసర్ జి.సోమశేఖర, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ నిర్మలామణి పర్యవేక్షించారు.
టంగుటూరు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన వల్లూరు గ్రామంలో వేంచేసిన వల్లూరమ్మ ఆలయంలో శుక్రవారం హుండీలను దేవదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకుడు వేణుగోపాలరావు ఆధ్వర్యంలో లెక్కించారు. మొత్తం 188 రోజులకు గాను 10 హుండీలు లెక్కించగా రూ.21,05,056 ఆదాయం వచ్చింది. అలాగే 32 గ్రాముల బంగారం, 185 గ్రాముల వెండి వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి రమేష్ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సేవా సంఘం సభ్యులు సభ్యులు, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎస్‌పురం (పామూరు): ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక ప్రాంతం భైరవకోన భైరవేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శుక్రవారం హుండీ లెక్కింపు కార్యక్రమం దేవదాయ ధర్మాదాయశాఖ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ పర్యవేక్షణలో చేపట్టారు. హుండీ కానుకలు సెప్టెంబర్ 17 నుంచి డిసెంబర్ 05వ తేదీ వరకు 2 నెలల 18 రోజులకు సంబంధించి లెక్కింపు నిర్వహించగా మొత్తం రూ.5,63,596 ఆదాయం వచ్చినట్లు ఈఓ డి.వంశీకృష్ణారెడ్డి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో ముద్దులూరి వెంకటరాజు, రుద్రరాజు, రాజేంద్ర, రణధీర్‌వర్మ, అర్చకబృందం, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బ్రహ్మానంద
వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా బ్రహ్మానంద


