అంతర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు సన్నద్ధం
ఒంగోలు సిటీ: ఏకేయూ అంతర్ యూనివర్సిటీ క్రీడా పోటీలకు టీములను సిద్ధం చేయాలని వైస్ చాన్సలర్ డీవీఆర్‌మూర్తి అన్నారు. ఒంగోలులోని ఆంధ్ర కేసరి యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ మీటింగ్ వీసీ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవీఆర్ మూర్తి మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ తరఫున పాల్గొనే వివిధ టీంల టోర్నమెంట్ల నిర్వహణ, టీమ్స్ సెలక్షన్ సంబంధించిన ఆర్థిక అంశాలు, విధి విధానాల్ని నిర్ణయించినట్లు తెలిపారు. వాలీబాల్, హ్యాండ్ బాల్, బ్యాడ్మింటన్, ఖోఖో, అథ్లెటిక్స్ తదితర క్రీడలకు టీములను సిద్ధం చేయడంపై ఆమోదం తెలిపారు. సమావేశంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.హరిబాబు, ప్రిన్సిపాల్, డిపార్టుమెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ హెచ్‌ఓడీ ప్రొఫెసర్ నిర్మలామణి, విశ్వవిద్యాలయ సీడీసీ డీన్ డాక్టర్ కేవీఎన్ రాజు, డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రొఫెసర్ జి రాజమోహన్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సత్యపాల్, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ అఫ్లియేటెడ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్లు కరుణ కుమార్, టీఆర్‌ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కందుకూరు, రమేష్ బాబు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కనిగిరి, సుశీలమ్మ, కేఆర్‌కే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అద్దంకి కళాశాలకు చెందిన ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు.


