అబద్ధాల మేళం..! | - | Sakshi
Sakshi News home page

అబద్ధాల మేళం..!

Dec 5 2025 6:02 AM | Updated on Dec 5 2025 6:02 AM

అబద్ధ

అబద్ధాల మేళం..!

మొక్కుబడిగా మమ అనిపించి... ● కొండపి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పాల్గొనకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రికి ఈ నియోజకవర్గంలో రైతులు పడుతున్న కష్టాలు పట్టవా అంటూ రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. అధికారులు మాత్రం తాము ఎంచుకున్న అధికార పార్టీ ఇంటివద్దకు వెళ్లి అక్కడికే రైతులను పిలిపించుకుని కార్యక్రమం నిర్వహించి ఫొటోలు దిగి మమ అనిపించారని రైతులు ఆరోపిస్తున్నారు. ● మా కోసం అది చేశాం.. ఇది చేశాం.. అంటున్నారు. ఖరీఫ్‌ దాటిపోయింది. రబీ ప్రారంభమై నెలరోజులైంది. ఇంతవరకూ మాకు కావాల్సిన వ్యవసాయ పనిముట్లయిన థైవాన్‌ స్ప్రేయర్లు, గొర్రు ట్రాక్టర్లు, విత్తనపు గొర్రులు ఇవ్వలేదు. పప్పుశనగ సాగు కూడా అయిపోయింది. ఒక్క పనిముట్టు కూడా ఇవ్వకలేదని పలువురు రైతులు అధికారులను నిలదీశారు. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కొనకనమిట్ల మండలాల్లో జరిగిన రైతన్నా మీ కోసం సభల్లో రైతులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ సిబ్బంది సమాధానం చెప్పలేకపోయారు. ఖరీఫ్‌లో సాగుచేసిన వరి, కంది, మిర్చి, పత్తి, రబీలో సాగుచేస్తున్న పప్పుశనగ, పొగాకు పంటలకు తెగుళ్ల నివారణకు రైతులు పవర్‌ స్ప్రేయర్లు అడుగుతున్నారు. అయితే రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు ఏంచెప్పలేకపోతున్నారు. దీంతోపాటు తుఫాన్‌ నష్టపరిహారం ఎప్పుడిస్తారని ప్రశ్నిస్తున్నారు. ● గిద్దలూరు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, గత ఏడాది, ఈ ఏడాదిలో తుఫాన్‌, అధిక వర్షాలతో నష్టపోయిన పంటలకు నష్టపరిహారం విడుదల చేయలేదని, ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదని, టార్ఫాలిన్‌ పట్టలు ఇవ్వాలని అధికారులను రైతులు ఉక్కిరిబిక్కిరి చేశారు. ● కనిగిరి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో జరిగిన రైతు భరోసా కేంద్రాల్లో సుమారు 12 నుంచి 15 గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లోనే నియోజకవర్గ ముఖ్యనేత పాల్గొన్నట్లు సమాచారం. దీంతో ఆయా గ్రామాల్లోనే రైతన్నా మీ కోసం సందడి చేశారే తప్ప.. మిగతా ఎక్కడా స్పందన లేదు. వ్యవసాయ అధికారులు, స్థానిక అధికార పార్టీ నాయకులు మినహా రైతులు నామ్‌కే వాస్తేగా దర్శనమిచ్చారు. అసలు సమావేశాలు ఎప్పుడు జరిగాయని రైతులు అడగడం గమనార్హం. ● సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ఫొటోలకే పరిమితమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారపార్టీకి అనుకూలంగా ఉన్న రైతులకు, ఆ పార్టీ నేతలకు పోస్టర్లు ఇచ్చి ఫొటోలు తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. చాలాచోట్ల యాప్‌ పనిచేయకపోవడం, సర్వర్‌ అందుబాటులోకి రాకపోవడంతో సగటున 20 మంది రైతుల వివరాలను కూడా నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. సంతనూతలపాడు మండలంలో మొక్కుబడిగా ప్రజలు కూర్చునే అరుగుల వద్దకు కొందరు రైతులను ఆహ్వానించి పోస్టర్లు ఆవిష్కరించి ఫొటోలతో సరిపెట్టారు. వాటిని నాయకులు గ్రూపుల్లో పోస్టు చేసుకుని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్టు ప్రచారం చేసుకోవడం గమనార్హం. ● యర్రగొండపాలెం నియోజకవర్గం పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల, యర్రగొండపాలెం మండలాల్లోని అన్ని సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేసుకున్నారు. ఆయా గ్రామాల్లో జరిగిన సమావేశాలకు రైతులు కాకుండా టీడీపీ వర్గానికి చెందిన గ్రామ నాయకులు, కార్యకర్తలను పిలిపించుకుని సమావేశాలను మమ అనిపించారన్న ఆరోపణలు ఉన్నాయి. మోంథా సాయం లేదు...

జిల్లాలో తుస్సుమన్న రైతన్నా మీ కోసం కార్యక్రమం ప్రచార ఆర్భాటం మినహా రైతుకు ఒరిగిందేమీలేదని విమర్శలు పలు నియోజకవర్గాల్లో రైతుల నుంచి నిరసనలు సమాధానం చెప్పలేక బిక్కముఖం వేసిన అధికారులు చంద్రబాబు ప్రసంగం చదివి వినిపించి మమ అనిపించిన యంత్రాంగం పలు నియోజవర్గాల్లో దూరంగా అధికార పార్టీ నేతలు

రైతన్నా మీ కోసం..

మా ఊళ్లో సమావేశం ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు

మా గ్రామంలో రైతన్నకు మీ కోసం సమావేశం ఎప్పుడు జరిగిందో మాకు తెలియనే తెలియదు. నేను నాలుగు ఎకరాల్లో మినుము, అలసంద సాగు చేశా. ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నీటమునిగి పంట దెబ్బతింది. సబ్సిడీపై విత్తనాలు ఇవ్వలేదు. బయట మార్కెట్‌లో కొని సాగుచేసుకుంటున్నా. చంద్రబాబు ఏటా రూ.20 వేలు అన్నదాత సుఖీభవ ఇస్తామని చెప్పారు. తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఈ ఏడాది రెండు దఫాలుగా సగమే వేశారు. ఆర్‌బీకేల ద్వారా సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. పంట నష్టపరిహారం ఇవ్వలేదు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ప్రతి ఏటా రైతు భరోసా కేంద్రం ద్వారా అన్నీ ఇచ్చారు. చంద్రబాబు పాలనలో రైతులను మోసం చేస్తున్నారు.

– దారా నాగయ్య, వెంగపల్లి , హనుమంతునిపాడు మండలం

ప్రభుత్వం ఏడాదిన్నర కాలంలో అన్ని రకాలుగా రైతును ముంచేసింది. చంద్రబాబు ప్రభుత్వంపై రైతులు ఆగ్రహంగా ఉండడంతో అధికారులు తూతూమంత్రంగా నిర్వహించి కార్యక్రమాన్ని మ..మ అనిపించారు.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు:

జిల్లాలో మొత్తం 5,31,369 మంది రైతులున్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్‌, రబీ సీజన్లలో వివిధ రకాల పంటలు సాగుచేసిన రైతులు లాభారు ఆర్జించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాతల పరిస్థితి తలకిందులైంది. మొదటి సంవత్సరం పాలనలో రెండు సార్లు ఖరీఫ్‌లోనూ, రబీలోనూ కరువు కరాళనృత్యం చేసింది. దాంతో ఒకసారి 17 మండలాలు, రెండోసారి 30 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. దాంతో పంటలు నష్టపోయిన రైతుల జాబితాలు సిద్ధం చేసి నష్టం అంచనాలను ప్రభుత్వానికి పంపారు. కానీ ఇంతవరకు పంట నష్టం రైతుకు చేరింది లేదు. గత సంవత్సరం దాదాపు రూ.100 కోట్లకుపైగా నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఇంత వరకు ఇవ్వలేదు. పంటల బీమా లేదు. యాంత్రీకరణ లేదు. ఇలా చెప్పుకుంటూపోతే రైతన్న కంట కన్నీళ్లు ఒలుకుతాయి. సబ్సిడీ విత్తనాలు లేవు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతన్నలు అప్పుల బాధతో విలవిల్లాడుతున్నారు. పొగాకు రైతులు పూర్తిగా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారు. బ్లాక్‌ బర్లీ పొగాకు తూతూమంత్రంగా కొనుగోలు చేసి పొగాకు రైతులను నిలువునా ముంచారు. ఇక, సజ్జ, మొక్కజొన్న, మిర్చి, పత్తి, వరి, జొన్న, కందులు, మినుములు ఇలా ఏ పంటకూ గిట్టుబాటు ధర దక్కలేదు. ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేయనూ లేదు. ఇంతటి దీనావస్థలో రైతులు కొట్టుమిట్టాడుతుంటే రైతన్నా మీ కోసం ఏమి ఒరగబెట్టడానికి చేపట్టారన్న విమర్శలు చంద్రబాబు ప్రభుత్వంపై పెల్లుబుకుతున్నాయి.

మోంథా తుఫాన్‌తో జిల్లాలో పత్తి 35,750 ఎకరాలు, సజ్జ 7,300, వరి 9,500, మొక్కజొన్న 7,100, ఇతర పంటలు 36 వేల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. తుఫాన్‌ వచ్చి నెలరోజులవుతున్నా ప్రభుత్వం నేటికీ పరిహారం అందజేసిన దాఖలాలు లేవు. గత ఏడాది ఫెంగల్‌ తుఫాన్‌ జిల్లాలోని పది మండలాల్లో తీవ్ర ప్రభావం చూపించింది. 7650 మంది రైతులు 25540 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకూ సాయం అందలేదని రైతులు వాపోతున్నారు. ఇక, అన్నదాత సుఖీభవకు ప్రభుత్వం కోతలు పెట్టింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఈ పథకాన్ని ఎగ్గొట్టి రైతులకు పంగనామాలు పెట్టారు. రెండో ఏడాదిలోనూ జిల్లాలో 15,970 మంది రైతులకు మొండిచేయి చూపారు. వైఎస్సార్‌ రైతు భరోసా 2,84,113 మందికి వర్తిస్తే నేడు 2,68,163 మంది అర్హులుగా గుర్తించారు. మరోవైపు దాదాపు 45 వేల మంది కౌలు రైతులకు నయాపైసా కూడా ఇవ్వకుండా వారికి వేదన మిగిల్చారు. రైతులకు ఎంతో ఉపయోగకరమైన 616 రైతు భరోసా కేంద్రాలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.

మొక్కుబడి సమావేశాలు మినహా నష్టపరిహారమేదీ

పది ఎకరాల్లో పత్తి సాగు చేశా. సుమారు రూ.3 లక్షల వరకూ ఖర్చు చేశా. మోంథా తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలకు పంట మొత్తం నష్టపోయా. నాణ్యత తగ్గి దిగుబడి లేక పొలాల్లో పీకిన పత్తిని కొనేవారులేక ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించడంలేదు. వ్యవసాయ సిబ్బంది మాత్రం గ్రామాల్లో రైతుల కోసమంటూ సమావేశాలు పెడుతున్నారు. నష్టపరిహారం ఇవ్వకుండా మొక్కుబడి సమావేశాలు ఎందుకో తెలియడం లేదు. పరిహారం ఇస్తేనే మేము కోలుకుంటాం.

– నర్రావుల బసవారెడ్డి, పత్తి రైతు, వెలిగండ్ల, కొనకనమిట్ల మండలం

అబద్ధాల మేళం..! 1
1/3

అబద్ధాల మేళం..!

అబద్ధాల మేళం..! 2
2/3

అబద్ధాల మేళం..!

అబద్ధాల మేళం..! 3
3/3

అబద్ధాల మేళం..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement