దోచుకునేందుకే ప్రైవేటీకరణ
కోటి సంతకాల సేకరణకు స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు
పొదిలిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న అన్నా రాంబాబు
పొదిలి రూరల్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో శ్రీకారం చుట్టారని, కానీ, ఆయనకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. బుధవారం పొదిలి నగర పంచాయతీలోని 5, 6, 7 వార్డుల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. నగర పంచాయతీ అధ్యక్షుడు సానికొమ్ము శ్రీనివాసులరెడ్డి అధ్యక్షత వహించగా, అన్నా రాంబాబు మాట్లాడుతూ రారష్ట్‌రంలో పేద, బడుగు, బలహీనవర్గాలకు ఉచిత వైద్యం, ఉచిత వైద్య విద్య అందించాలని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రంలో ఏకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యంపై బాధ్యత లేదన్నారు. వేల కోట్లు ఖర్చు చేసి జగనన్న నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులను పూర్తిచేయాల్సిన చంద్రబాబు ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంతో వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందన్నారు. ప్రైవేటు వ్యక్తులు పేదలకు ఉచితంగా వైద్యం చేస్తారా..? అని అన్నా రాంబాబు ప్రశ్నించారు. కేవలం ప్రైవేటు వైద్యం పేరుతో పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి డబ్బు దోచుకునేందుకే చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలలో పీపీపీ విధానాన్ని అమలు చేస్తోందని మండిపడ్డారు.
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించిన వైద్య కళాశాలలను కొనసాగించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల ముందు మోసపూరిత హామీలిచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కుట్రపూరిత పాలన సాగిస్తోందన్నారు. ఓవైపు ప్రజలందరికీ ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు పూనుకోవడం, మరోవైపు ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేసి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్సార్ సీపీ వ్యతిరేకిస్తూ ప్రజల తరఫున రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. చంద్రబాబు తన హయాంలో రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా స్థాపించలేకపోయారన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు లేవన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాలతో కూటమి ప్రభుత్వం కళ్లు తెరిపిద్దామంటూ అన్నా రాంబాబు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, జి.శ్రీనివాసులు, కల్లం సుబ్బారెడ్డి, ఉడుముల వరలక్ష్మమ్మ, నూర్జహాన్‌బేగం, గౌసియాబేగం, మస్తాన్‌వలి, యక్కలి శేషగిరిరావు, పి.భాను, యశోదరావు, గౌస్‌బాషా, రబ్బానీ, బాజీ, రమణకిషార్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కుయుక్తులు
ప్రైవేటీకరిస్తే పేదలకు వైద్యం దూరం
పీపీపీ విధానాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి
వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
పొదిలి పట్టణంలోని 5, 6, 7 వార్డుల్లో కోటి సంతకాల సేకరణ
దోచుకునేందుకే ప్రైవేటీకరణ


