పీపీపీతో వచ్చే తరాలకు అంధకారమే
కోటి సంతకాల సేకరణతోప్రభుత్వానికి కనువిప్పు కావాలి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం: మెడికల్ కాలేజీలను, అనుబంధ వైద్యశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నందుకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల సేకరణతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగి నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు అన్నారు. మండలంలోని మాల్యవంతునిపాడు, బొడిచెర్ల గ్రామాల్లో బుధవారం రాత్రి కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడారు. రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అసంపూర్తిగా ఉన్న మెడికల్ కాలేజీలను వారి అనుకూలమైన వారికి దోచిపెట్టేందుకు పీపీపీ విధానం తీసుకునిరావడం అన్యాయమని అన్నారు. 66 ఏళ్లపాటు ప్రభుత్వం లీజుకు ఇవ్వటం దారుణమన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంతో మాట్లాడి 17 మెడికల్ కాలేజిలను ఒకేసారి రాష్ట్రంలో ప్రారంభించారన్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం నూతనంగా ఏర్పాటుకానున్న మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కట్టాలని చూస్తోందని, ఇలా అయితే భవిష్యత్తు తరాల విద్యార్థులకు అన్యాయం చేసిన వారమవుతామని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కాలేజీలు పూర్తయితే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యతో పాటు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందుబాటులో ఉంటాయన్నారు. పాలకులు పార్టీలకతీతంగా పేద, మధ్య తరగతి వారికి విద్య, వైద్యం అందిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కాలేజీలను పూర్తి చేసేందుకు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సుమారు రూ.550 కోట్లు ఖర్చుపెట్టకపోవడం కూటమి ప్రభుత్వం వైఫల్యమే అన్నారు. పార్టీలకతీతంగా నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పోరెడ్డి చెంచిరెడ్డి, పీఎల్‌పీ యాదవ్, ఏఎంసీ మాజీ చైర్మన్ జీ.శ్రీనివాసరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి, నల్లబోతుల కొండయ్య, మాల్యవంతునిపాడు సర్పంచ్ జీ.వెంకటేశ్వర్లు, పీ.వెంకటేశ్వరరెడ్డి, పెద్దిరెడ్డి, శేషిరెడ్డి, గంజి శివారెడ్డి, వెంకటరెడ్డి, సత్యంరెడ్డి, వై.గాలిరెడ్డి, రామమహేశ్వరరెడ్డి, వై.శ్రీనివాసరెడ్డి, టీ.వెంకటరెడ్డి, ఏ.శ్రీనివాసులు, కె.దొనకొండయ్య, సుబ్బయ్య, రోశయ్య, పెద్దమల్లయ్య, ఉత్తమ్‌కుమార్, కె.శ్రీనివాసరెడ్డి, బూదల గురవయ్య, నాదబ్రహ్మం పాల్గొన్నారు. బొడిచర్ల సర్పంచ్ ఎం.కోటేశ్వరి, ఉప సర్పంచ్ బి.నాగమల్లేశ్వరి, ఎంపీటీసీ ఎం.లక్ష్మీదేవి, భవనం వెంకటరామిరెడ్డి, షేక్ మహ్మద్‌రఫీ, చంద్రశేఖరరెడ్డి, జీ.అనంతరెడ్డి, ఎస్.రామిరెడ్డి, దేవదాసు, నవయ్య, భాస్కర్‌రెడ్డి, కాశింవలి, బాలిరెడ్డి, పొదిలి శేఖర్, రాజ, రామసుబ్బారెడ్డి, వీరాంజనేయులు, తర్లుపాడు మండల కన్వీనర్ మురారి వెంకటేశ్వర్లు, చదలవాడ రమణారెడ్డి, పలువురు పార్టీనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అన్నా రాంబాబు వేసి నివాళులర్పించారు.


