మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే..
మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే చంద్రబాబు ప్రభుత్వం స్మార్ట్ కిచెన్‌లను తీసుకొస్తోంది. దీని వలన విద్యార్థులు వేడి ఆహారానికి దూరమవుతారు. ఎప్పటి నుంచో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతారు. ఇలాంటి పథకాన్ని రూపొందించేటప్పుడు అన్నీ వైపుల నుంచి చర్చించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని చేతులు కాల్చుకోవడం తగదు. ఏక్తా శక్తి విషయంలో కూడా ఇలాగే జరిగింది. రేపు స్మార్ట్ కిచెన్ల విషయంలో కూడా ఇలాంటి అనుభవాలే ఎదురైనా ఆశ్చర్యం లేదు.
– పి.కల్పన, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్
పర్యవేక్షణ లేకుండా పోతుంది
ఇప్పటి వరకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. స్మార్ట్ కిచెన్లు అమలులోకి వస్తే ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా పోతుంది. కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం అవుతుంది. దాంతో మధ్యాహ్న భోజనం పథకం ప్రధానాశయం దెబ్బతింటుంది. ఈ ఆలోనచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవడం ఉత్తమం.
– షేక్ అబ్దుల్ హై, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు


