ప్రకాశం
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025
వ్యాయామ
ఉపాధ్యాయుడికి సంకెళ్లు
సింగరాయకొండ: మండలంలోని పాకల జెడ్పీ హైస్కూల్లో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన కేసులో వ్యాయామ ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్‌లో పీడీ పిల్లి హజరత్తయ్య, తెలుగు ఉపాధ్యాయుడు చిరుమళ్ల మాధవరావుపై పోక్సో కేసు నమోదైంది. ఆరోపణలు రుజువు కావడంతో శుక్రవారం హజరత్తయ్యను అరెస్టు చేశారు. మాధవరావు కోసం గాలిస్తున్నారు.
9
16న టెన్నికాయిట్ జిల్లా జట్ల ఎంపిక
సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్‌సీ అండ్ జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఈనెల 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపిక నిర్వహిస్తున్నట్లు పీడీ శంకరరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 1 వ తేదీ 2011 తరువాత పుట్టినవారే అర్హులు.


