నల్లమలలో భారీ వర్షం
బేస్తవారిపేట : చెన్నుపల్లెలో కూలిన పూరిగుడిసె గోడ
శ్రీశైలం, దోర్నాల మార్గంలో
నిలిచిన రాకపోకలు
పెద్దదోర్నాల: నల్లమల అభయారణ్యంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్దదోర్నాల మండల పరిధిలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మంగళవారం శ్రీశైలం రహదారిలోని తుమ్మలబైలు సమీపంలోని చేమవాగు, చింతల సమీపంలోని వీర్ల వాగులు పొంగి ప్రవహించటంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీశైలం రహదారిలో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. దీంతో నట్టనడివిలో వాహనాలు నిలిచిపోవటంతో ఆయా వాహనాల్లో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ముందస్తు జాగ్రత్తగా మండల కేంద్రంలోని గణపతి చెక్‌పోస్టు వద్ద వాహనాల రాకపోకలను నిలిపేశారు.
నల్లమలలో భారీ వర్షం


