వైఎస్సార్ సీపీలో నియామకం
● అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయలక్ష్మి
ఒంగోలు సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ అంగన్‌వాడీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సాధం విజయలక్ష్మిని నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
కూలిన మట్టి మిద్దె
కొమరోలు: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి మిద్దె కూలిన సంఘటన కొమరోలు మండలంలోని పామూరుపల్లె గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. పామూరుపల్లె గ్రామంలో చిన్నపురెడ్డికి చెందిన మట్టి మిద్దె కూలిన సమయంలో అతను ఇంట్లోనే ఉండటంతో దంతెలు పడి గాయాలయ్యాయి. అతన్ని వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని చిన్నపురెడ్డి కోరారు. వీఆర్‌ఓ పాండు మట్టి మిద్దెను పరిశీలించారు.


