
వరికోత యంత్రాన్ని ఢీకొన్న కారు
● ముగ్గురికి గాయాలు
కంభం: ఆగి ఉన్న వరికోత యంత్రాన్ని కారు ఢీకొని ముగ్గురికి గాయాలయ్యయి. ఈ సంఘటన బుధవారం రాత్రి కంభంలో జరిగింది. వివరాల్లోకి వెళితే..బేస్తవారిపేట మండలం నుంచి పోలవరం వెళ్తున్న వరి కోత యంత్రం అనంతపురం– అమరావతి హైవే రోడ్డుపై కందులాపురం అడ్డరోడ్డు వద్ద టైరు పంచరు కావడంతో రోడ్డుకు ఎడమవైపున ఆగి ఉంది. అదే సమయంలో గిద్దలూరు నుంచి మార్కాపురం వెళ్తున్న ఓ కారు ఆగి ఉన్న వరి కోత యంత్రాన్ని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ఉన్న గోపిదేశి శేఖర్, అతని భార్య చెంచులక్ష్మి తలకు, కాళ్లకు గాయాలు కాగా నాలుగేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం మార్కాపురం వైద్యశాలకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏఎస్సై నారాయణ వైద్యశాలలో క్షతగాత్రుల వద్ద వివరాలు సేకరించారు.

వరికోత యంత్రాన్ని ఢీకొన్న కారు