
ఎయిడెడ్
ఉమ్మడి ప్రకాశంలో ఎయిడెడ్ పాఠశాలల వివరాలు ఇవీ..
కూటమి ప్రభుత్వంలో మూతపడనున్న ఎయిడెడ్ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరానికి మూతపడనున్న పాఠశాలలు 65 దిక్కుతోచని స్థితిలో ఎయిడెడ్ ఉపాధ్యాయులు ఎయిడెడ్ ఉపాధ్యాయులను సర్దుబాటు చేయని దుస్థితి ఎన్నికల ముందు హామీలు.. ఆ తర్వాత నెత్తిన టోపీలు ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
కంభం మండలంలోని ఎయిడెడ్ పాఠశాల
అసంబద్ధ నిర్ణయాలతో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కూటమి ప్రభుత్వం తీరు ఎయిడెడ్ పాఠశాలలకు మరణ శాసనంలా మారింది. సరిపడినన్ని మంది విద్యార్థులు లేరనే సాకుతో ఎయిడెడ్ పాఠశాలలు మూసేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే రెండు విడతలుగా 65 పాఠశాలలకు నోటీసులు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి అవి మూతపడనున్నాయి. ఎయిడెడ్ పాఠశాలల్లో మిగులుగా ఉన్న ఉపాధ్యాయుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. మిగులు ఉపాధ్యాయులను మిగిలిన ప్రభుత్వ పాఠశాలలకు సర్దుబాటు చేసేందుకు కౌన్సెలింగ్ నిర్వహించాలని యూనియన్లు ఎన్ని సార్లు కోరినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లు: 376
ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు: 234
ఒంగోలు సిటీ:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠశాల విద్యను సర్వనాశనం చేసింది. ఎన్నికలకు ముందు ఎయిడెడ్ పాఠశాలలను మరింత ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ తరువాత పిల్లలు లేరనే కారణంతో పాఠశాలలను మూసివేయడానికి ఆదేశాలు జారీ చేస్తోంది. ఇన్నాళ్లు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు చదువులు చెప్పిన ఎయిడెడ్ యాజమాన్యాల పాఠశాలల పరిస్థితి నేడు ఆగమ్య గోచరంగా మారింది.
2026 నాటికి ఎయిడెడ్ కథ సమాప్తం..
ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 132 ఎయిడెడ్ పాఠశాలు ఉన్నాయి. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 83, ప్రాథమికోన్నత పాఠశాలలు 20, ఉన్నత పాఠశాలలు 33 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 376 మంది ఉపాధ్యాయులు, హైస్కూల్స్‌లో 234 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు లేని ఎయిడెడ్ పాఠశాలలు 14 ఉండగా, ఇందులో 40 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఎయిడెడ్ పాఠశాలలన్నింటిలో 170 మంది ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నారు. 30 డిసెంబర్ 2024 లో 17 పాఠశాలలకు నోటీసులు ఇచ్చారు. ఇటీవల 48 పాఠశాలలకు కూడా నోటీసులు జారీ చేశారు. 2026 ఏప్రిల్ నాటికి 65 పాఠశాలలు మూతపడునున్నాయని అధికారులు చెబుతున్నారు.
ఉపాధ్యాయుల భవితవ్యం ఏంటి..?
ఎయిడెడ్ పాఠశాలల్లో పిల్లలు లేరన్న సాకుతో వాటిని మూసేసే దిశగా కూటమి ప్రభుత్వం ఉంది. అయితే అందులో పనిచేసే ఉపాధ్యాయులను మాత్రం పట్టించుకోవడం లేదు. మిగులు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని యూనియన్లు ఎన్ని సార్లు వినతిపత్రం అందజేసినా, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం పని చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు వాళ్లను కూడా ఎక్కడో ఓచోట సర్దుబాటు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఇంతవరకు ఆ దిశగా ముందుకు సాగలేదు. కనీసం వారి నుంచి అభ్యర్థనలు కూడా స్వీకరించలేదు. కేవలం కాలయాపన చేస్తూ ఏదో విధంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులను తొలగించే పనిలో ఉందని అర్థమవుతోంది. ఇటువంటి విధానాలతో ఎయిడెడ్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసే ఆలోచనలో ప్రభుత్వ ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.
మిగులు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఎయిడెడ్ పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్ నిర్వహించాలి. ఎయిడెడ్ ఉపాధ్యాయుల సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా ఎయిడెడ్ ఉపాధ్యాయులకు కూడా ఆరోగ్య కార్డులు, కారుణ్య నియామకాల విషయంలో కూటమి ప్రభుత్వం వివక్ష చూపకుండా న్యాయం చేయాలి.
– కె.వెంకటరావు, ఏపీ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్షుడు

ఎయిడెడ్

ఎయిడెడ్

ఎయిడెడ్

ఎయిడెడ్

ఎయిడెడ్

ఎయిడెడ్

ఎయిడెడ్

ఎయిడెడ్