
16 మందికి కారుణ్య నియామకాలు
ఒంగోలు సబర్బన్: ప్రభుత్వ సర్వీసులో చేరిన వారు చిత్తశుద్ధితో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేయాలని కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. ప్రకాశం భవనంలో 16 మందికి కారుణ్య కోటాలో నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో నైపుణ్యం పెంచుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ వారిని అభినందించారు. నియామక పత్రాలు పొందిన వారిలో ఆఫీసు సబార్డినేట్లు, టైపిస్టులు, జూనియర్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీలు (గ్రేడ్ – 5,6) ఉన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, ఏపీఎస్‌ఆర్టీసీ ఆర్.ఎం. జి.సత్యనారాయణ, సూపరింటెండెంట్ ఫణికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి రవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
● ముగ్గురు సీసీలకు చార్జ్ మెమో
పామూరు: పొదుపు మహిళా గ్రూపుల లావాదేవీల్లో అక్రమాలకు పాల్పడిన ఏపీఎం రజనీకుమారి, సీసీ గంగసాని భాస్కర్‌ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు సీసీలకు చార్జ్ మెమూ ఇచ్చినట్లు డీపీఎం ఆర్‌ఆర్‌ఎల్ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. మండలంలోని గోపాలపురం, మోట్రావులపాడు గ్రామాల పొదుపు గ్రూపు సభ్యులు తమ సీసీఎల్ లోన్స్, సీ్త్రనిధి, ఉన్నతి లోన్స్‌లో అక్రమాలు జరిగినట్లు వీఓఏ బేబీషాలిని, వెలుగు అధికారులు, సీసీలపై గతంలో అధికారులకు పిర్యాదుచేశారు. దీనిపై ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేసి రూ.36.91 లక్షల అవినీతి జరిగినట్లు గుర్తించి నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. కలెక్టర్ స్పందించి అక్రమాలకు బాధ్యులైన నాటి పామూరు ఏపీఎం, ప్రస్తుత హెచ్‌ఎంపాడు ఏపీఎం రజనీకుమారి, నాటి వెలుగు సీసీ గంగసాని భాస్కర్‌రెడ్డిలను సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు సీసీలు శ్రీనివాసులు, రమణయ్య, సుబ్రమణ్యంలకు చార్జ్‌మెమో ఇచ్చినట్లు డీపీఎం తెలిపారు. కాగా నాటి వీఓఏ బేబీషాలిని ఇప్పటికే విధులకు దూరంగా ఉన్నారు.