
బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
కందుకూరు రూరల్: ఉమ్మడి ప్రకాశం జిల్లా మహిళ, పురుషుల బాస్కెట్ బాల్ జట్ల ఎంపికలు ఆదివారం కందుకూరులోని టీఆర్‌ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో నిర్వహించారు. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 40 మంది పురుషులు, 30 మంది మహిళలు పాల్గొన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన 12 మంది పురుషులు, 12 మంది మహిళలను జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. ఈ జట్లు విశాఖపట్నంలో నవంబర్ 7 నుంచి 10వ తేదీ వరకు జరిగే 11వ సీనియర్ రాష్ట్ర చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా బాస్కెట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలేటి రవీంద్ర, సెక్రటరీ తొట్టెంపూడి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచి విజయం సాధించాలన్నారు. క్రీడా కోటాలో ఉద్యోగాలు కూడా సాధించాలన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ మెంబర్ సయ్యద్ జిలాని బాషా, పీడీ యు.సుబ్రహ్మణ్య, పీడీ పోతురాజు, రమ్య తదితరులు పాల్గొన్నారు.

బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక