
మెడికల్ కాలేజీలపై బాబు కుట్ర
మార్కాపురం టౌన్: పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెడికల్ కాలేజీలపై చంద్రబాబు కుట్ర పన్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ పట్టణంలోని 1,4, 10, 11 బ్లాకుల్లో ఆదివారం కోటి సంతకాల సేకరణ చేపట్టారు. తొలుత తూర్పు వీధిలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనే 5 మెడికల్ కాలేజీలకు పీజు సీట్లు కూడా మంజూరు చేశారని, 2024లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే మిగిలిన కాలేజీలు కూడా పూర్తయ్యేవన్నారు. 70 శాతం పూర్తయిన కళాశాలలను శాతం ప్రైవేట్‌పరం చేయడం దుర్మార్గమన్నారు. పార్టీలకతీతంగా జరుగుతున్న కోటి సంతకాల సేకరణలో స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు ప్రాజెక్టును ప్రాముఖ్యను గుర్తించి రూ.3,500 కోట్లు మంజూరు చేశారన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రాజెక్టుకు శిలాఫలకం వేసింది నేనేనంటూ, పూర్తిచేసేది కూడా నేనేనంటూ చెప్పుకోవడమే తప్ప చేసిందేమీ లేదన్నారు. కూటమి పాలనలో ప్రజలకు చేసింది శూన్యమన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. అన్నా కృష్ణచైతన్య, పార్టీ స్టేట్ కమిటీ సభ్యులు వెన్న హనుమారెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షంషేర్ ఆలీబేగ్, ఏఎంసీ మాజీ చైర్మన్ గొలమారి శ్రీనివాసరెడ్డి, ఉడుముల కోటిరెడ్డి,, జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ చర్లంచర్ల బాలమురళీకృష్ణ, డాక్టర్ చప్పల్లి కనకదుర్గ, టౌన్‌పార్టీ ప్రెసిడెంట్ సలీమ్, సిరాజ్, పత్తి రవిచంద్ర, ఉత్తమ్‌కుమార్, రోజ్‌లిడియా, కొత్త కృష్ణ, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, రంగస్వామి గౌడ్, చాటకొండ చంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, గొలమారి శివారెడ్డి, మండల పార్టీ అద్యక్షులు చెంచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బినామీలకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ జపం
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు ధ్వజం