
‘కోటి సంతకాలు’ త్వరగా పూర్తి చేయాలి
● మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ
సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున
మద్దిపాడు: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కోటి సంతకాల కార్యక్రమం త్వరితగతిన పూర్తి చేయాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య కళాశాలలను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్మాణాలు పూర్తి చేసి నడిపేలా ఒత్తిడి తీసుకురావడానికి జగనన్న కోటి సంతకాల కార్యక్రమం చేపట్టారన్నారు. మండల నాయకులు అందరూ వారి వారి గ్రామాల్లో కోటి సంతకాల కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేస్తే సంతకాలను కేంద్ర కార్యాలయానికి పంపించడానికి వీలవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు.