
దీపావళి మరిన్ని వెలుగులు నింపాలి
● జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ
ఒంగోలు సబర్బన్: తగ్గిన జీఎస్‌టీ ధరలు ప్రజల జీవితాల్లో మరిన్ని దీపావళి వెలుగులు నింపాలని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. ‘సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్’ ప్రచార ముగింపు కార్యక్రమం ఆదివారం ప్రకాశం భవనంలో నిర్వహించారు. జీఎస్టీ శాఖ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ సురేంద్ర, కమర్షియల్ ట్యాక్స్ అధికారి కొప్పోలు సుధాకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక రంగమైన వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేందుకే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 50 శాతం మేర సుంకాలను విధించాడని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు విమర్శించారు. ట్రంప్ విధించిన సుంకాలకు నిరసనగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నెరుసుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ట్రంప్ విధిస్తున్న సుంకాలతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలకు మన దేశ ప్రధాని సాగిలపడి దాసోహం చేస్తున్నాడని విమర్శించారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు మాట్లాడుతూ అమెరికా తమ ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసమే సుంకాలను విధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆయుధాలను మనదేశంలో దిగుమతి చేసుకోవాలని మోడీపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అనంతరం ట్రంప్ చిత్రపటానికి కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మాబు నిప్పంటించారు. కార్యక్రమానికి రైతు సంఘం మండల కార్యదర్శి ఎన్వీ నరసింహం అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల అధ్యక్షుడు కరిచేటి హనుమంతరావు, అన్ను వెంకటసుబ్బారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు ఎం సుశీల, ఏ శేషారావు, గౌరవాధ్యక్షుడు ఈ సుబ్బారావు, సీఐటీయూ మండల కన్వీనర్ షేక్ మస్తాన్, ఐద్వా నాయకులు ఎన్ మాలతి, ఎస్‌కే నాగూర్ భీ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.

దీపావళి మరిన్ని వెలుగులు నింపాలి