పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం | - | Sakshi
Sakshi News home page

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం

Oct 20 2025 7:26 AM | Updated on Oct 20 2025 7:54 AM

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం

ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని నిలదీస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయ్‌రెడ్డితో పాటు పలువురు జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి విచారణల పేరుతో వేధిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారీ ఎక్కడో ఒక చోట సంబంధం లేని వ్యక్తులతో ఫిర్యాదుల చేయించి పోలీసులను ఉసిగొల్పుతోంది. పత్రికల గొంతు నొక్కి ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేయాలని కూటమి సర్కారు చేస్తున్న కుట్రలపై ప్రజాగ్రహం పెళ్లుబుకుతోంది.

– సాక్షి నెట్‌వర్క్‌

సాక్షి జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎత్తివేయాలి

సాక్షి ఎడిటర్‌ ధనుంజయరెడ్డితో పాటు మిగిలిన పాత్రికేయులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి. పత్రికల్లో రాసిన వార్తల ఆధారంగా కేసులు నమోదు చేయడం సరికాదు. ఈ విధానాన్ని ప్రభుత్వం మానుకోవాలి. ఇలా అయితే ప్రజాస్వామ్య మనుగడ కష్టం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం కాపాడాలి. అధికారంలో ఉన్న వారికి పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వొచ్చు కానీ, పోలీసులతో కేసులు పెట్టించ కూడదు. ప్రజలన్నీ గమనిస్తున్నారు.

– జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నెల్లూరు పార్లమెంట్‌

వైఎస్సార్‌ సీపీ పరిశీలకుడు, పార్టీ సెంట్రల్‌ కమిటీ సభ్యుడు

కక్షసాధింపు తగదు

సమాజంలో జరుగుతున్న వాస్తవాలను బయట పెడుతున్న పత్రికలపై కక్షసాధింపు తగదు. సాక్షి ఎడిటర్‌ ధనుంజయ రెడ్డి, రిపోర్టర్లపై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సమంజసంగా లేదు. కూటమి నాయకులు చేస్తున్న అక్రమాలను వెలికి తీస్తే కక్ష సాధింపులకు పాల్పడడం మంచి పద్ధతి కాదు. ప్రజా పక్షాన నిలబడి నిజాన్ని నిర్భయంగా చెప్పేది ఒక సాక్షి పత్రిక మాత్రమే. ప్రభుత్వంలో అక్రమాలను వెలికితీస్తున్న జర్నలిస్టులు చేస్తున్న కృషిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదు.

– ఉడుముల శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు, ప్రకాశం జిల్లా

నియంతృత్వ పోకడలకు పరాకాష్ట

ప్రభుత్వ వైఫల్యాలను, అక్రమాలను వెలికితీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయరెడ్డి, జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం అత్యంత దుర్మార్గం. రాష్ట్రంలో నకిలీ మద్యం పేరుతో కొనసాగుతున్న దోపిడీని బయటపెట్టినందుకు పత్రికను నిలువరించేందుకు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం తీరు అత్యంత గర్హనీయం. రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తున్నారు.

– కేవీ రమణారెడ్డి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లా

కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి

కూటమి ప్రభుత్వం జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించి కక్షసాధింపు చర్యలకు పాల్పడటం మానుకోవాలి. సాక్షి ఎడిటర్‌ ఆర్‌.ధనుంజయరెడ్డికి నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను కాపాడాలి. జర్నలిస్టులపై పెట్టిన కేసులన్నింటినీ ఎత్తివేయాలి. పత్రికల్లో వార్తలు రాశారని కేసులు నమోదు చేయడం అనైతికం. కూటమి ప్రభుత్వం బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదు.

– వై.వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లా

సాక్షి జర్నలిస్ట్‌లపై కేసులు ఎత్తివేయాలి

సాక్షి ఎడిటర్‌ ఆర్‌ ధనుంజయర్‌రెడ్డి, ఇతర జర్నలిస్టులపై పెట్టిన అక్రమకేసులను తక్షణం ఎత్తివేయాలి. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను ప్రభుత్వం కాపాడాలి. పత్రికల్లో వచ్చిన వార్తలు నచ్చకపోతే ఖండన ఇవ్వొచ్చు. కానీ పాత్రికేయుల ఇళ్లలో సోదాలు చేసి భయభ్రాంతులకు గురి చేయడం దుర్మార్గం. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

–కల్లూరి రామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ టీచర్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం 1
1/4

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం 2
2/4

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం 3
3/4

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం 4
4/4

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement