
జక్కంపూడి రాజాకు ఘనస్వాగతం
సింగరాయకొండ: వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాకు ఆదివారం కందుకూరు ఫ్‌లైఓవర్ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలం దారకానిపాడు గ్రామానికి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న సందర్భంగా పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో కలిశారు. పార్టీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు కనపర్తి శేషారెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి రాజాకు స్వాగతం పలికారు. ఆయన వెంట దారకానిపాడు వెవెళ్లారు. పార్టీ కొండపి మండల అధ్యక్షుడు బచ్చల కోటేశ్వరరావు, జరుగుమల్లి మండల అధ్యక్షుడు పిన్నిక శ్రీనివాసులు, ఎం గంగాధర్, లింగాబత్తిన రాజా పాల్గొన్నారు.
ఒంగోలు వన్‌టౌన్: దీపావళి సందర్భంగా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లును అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ గుంటూరు మేనేజర్ ఎస్ శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన వినియోగదారుల కోసం రూ.1 రిచార్జి పథకంతో నెల రోజుల పాటూ ఆన్‌లిమిటెడ్ కాల్స్, 2 జీబీ హై స్పీడ్ డేటా అందిస్తున్నట్లు చెప్పారు. నేడు రూ.100ల పై రీచార్జి చేసుకుంటే లక్కీడ్రాలో అర్హత పొందుతారని, డ్రాలో 10 మందికి 10 గ్రాముల వెండి నాణేలు అందించనున్నట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్ ప్లాన్‌లో 1812లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటాను నవంబర్ 15 వరకూ రీచార్జి చేసుకునే వారికి అందించనున్నట్లు చెప్పారు.