ప్రైవేటీకరణపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణపై పోరాటం

Oct 11 2025 9:34 AM | Updated on Oct 11 2025 9:34 AM

ప్రైవేటీకరణపై పోరాటం

ప్రైవేటీకరణపై పోరాటం

మార్కాపురం: గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలందరికీ ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించడంతో పాటు విద్యార్థులకు వైద్య విద్యను కూడా అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ఒకేసారి 17 మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేశారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు వివరించారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టడం బాధాకరమని అన్నారు. దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేయనున్నట్లు చెప్పారు. మార్కాపురం పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెడికల్‌ కళాశాలలను నిలిపివేయడంతోపాటు ఇటీవల కాలంలో వాటిని ప్రైవేటీకరణ చేస్తూ పీపీపీ విధానంలో నిర్మించాలని టెండర్లను ఆహ్వానించడం దారుణమని అన్నారు. ప్రైవేట్‌ వ్యక్తుల ఆధీనంలో మెడికల్‌ కళాశాలల నిర్వహణ ఉంటే పేదలకు ఉచితంగా వైద్యం ఎలా అందుతుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్‌ కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల నుంచి కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని నవంబరు 22వ తేదీ వరకూ గ్రామాలు, పట్టణాల్లో వాడవాడలా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28న మార్కాపురం నియోజకవర్గ కేంద్రాల్లో మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబరు 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీ జరుగుతుందన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాలను 23న జిల్లా కేంద్రాలకు పంపనున్నట్లు వెల్లడించారు. అనంతరం 24న పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించిన తరువాత రాష్ట్ర గవర్నర్‌కు అందజేయనున్నట్లు తెలిపారు. ఇది రాజకీయ లబ్ధి కోసం చేసేది కాదని, ప్రజలందరూ స్వచ్ఛందంగా సంతకాల సేకరణలో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ రమణారెడ్డి, ఏపీ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మీర్జా షంషేర్‌ ఆలీబేగ్‌, మార్కాపురం, కొనకనమిట్ల ఎంపీపీలు లక్ష్మీదేవీ కృష్ణారెడ్డి, మురళీకృష్ణ యాదవ్‌, మార్కాపురం, కేకే మిట్ల జెడ్పీటీసీలు నారు బాపన్‌రెడ్డి, అక్కిదాసరి ఏడుకొండలు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ చిర్లంచర్ల బాల మురళీకృష్ణ, బీసీ సెల్‌ రాష్ట్ర నాయకులు పీఎల్‌పీ యాదవ్‌, పార్టీ పట్టణ కన్వీనరు సలీమ్‌, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, పొదిలి పట్టణ, మండల కన్వీనర్లు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, గుజ్జుల సంజీవరెడ్డి, కౌన్సిలర్లు డాక్టర్‌ కనకదుర్గ, చంద్ర శేఖర్‌, రోజ్‌లిడియా, ముత్తారెడ్డి వెంకట రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణ రెడ్డి, పార్టీ నాయకులు బట్టగిరి తిరుపతిరెడ్డి, శేషయ్య, కొండయ్య, గౌస్‌ మొహిద్దీన్‌, కేకే మిట్ల వైస్‌ ఎంపీపీ మెట్టు వెంకటరెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు

వ్యతిరేకంగా వైఎస్సార్‌ సీపీ ఉద్యమం

కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభం

వాల్‌పోస్టర్లు ఆవిష్కరించిన

మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement