
‘కల్తీ మద్యం’పై నిరసన
మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా సరఫరా మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ
ఒంగోలు సిటీ: మద్యం దుకాణాల్లో కల్తీ మద్యం విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ ఒంగోలులోని అంబేడ్కర్ భవనం వద్ద శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. కల్తీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మహిళా విభాగం నాయకులు ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకొని పది మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయం లో డీసీ కి వినతిపత్రం ఇచ్చారు. అనంతరం కార్యాలయం ఎదురు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసిన కల్తీ మద్యం వల్ల మరణాలు ఎక్కువవుతున్నాయన్నారు. అధికార పార్టీ అండతో రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారని ధ్వజమెత్తారు. అధికార పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరు ఏరియాలను పంచుకున్నారని విమర్శించారు. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ఇన్‌చార్జ్ గంగసాని లక్ష్మి మాట్లాడుతూ జగనన్న ఇంటి వద్దకే పరిపాలన అని మంచి చేస్తే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని హోం డెలివరీ చేస్తోందని విమర్శించారు. లిక్కర్ షాపులే ఒక కుంభకోణమన్నారు.
కార్యక్రమంలో హెచ్‌ఎం పాడు ఎంపీపీ గాయం సావిత్రి, రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, మద్దిపాడు ఎంపీపీ వాకా అరుణ, పార్టీ మహిళా నాయకులు సన్నపురెడ్డి రవణమ్మ, గోనెల మేరీ కుమారి, సయ్యద్ అప్సర్, పులి శాంతి, వడ్లమూడి వాణి, కాకర్లమూడి రజిని, జమీల బేగం, సవరం రత్తమ్మ, నెలకుర్తి మహేశ్వరి, పండిటి లక్ష్మి,నాగమణి, మన్యం సంధ్య, పి.లక్ష్మి, కె.సంధ్య, మొలకపల్లి సీతమ్మ, తన్నీరు రాగమ్మ, కే లక్ష్మి, పీ పార్వతి, జీ మాలతి, పీ అమూల్య, జీ తిరుపతమ్మ, రాచూరి సుస్మిత, మాధవి, బత్తుల కోటమ్మ, రాధా, ఎన్ సరిత, ఇండ్ల భాను, ముద్దావనమ్మ, రాచూరి పుష్ప, ఎం లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.