మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

Oct 11 2025 6:04 AM | Updated on Oct 11 2025 6:04 AM

మెడిక

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

మాజీ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌

సింగరాయకొండ: పేద, మధ్య తరగతి వర్గాలకు వైద్య విద్యను, వైద్యాన్ని దరిచేర్చటానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంజూరు చేసిన మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వ పన్నాగాలను అడ్డుకోవటంతో పాటు పీపీపీ విధానాన్ని రద్దు చేసే వరకు ఉద్యమిస్తామని పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని పాకల గ్రామంలో అభ్యుదయ కళ్యాణ మండపంలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డాక్టర్‌ సురేష్‌ మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్ల కొరతను తెలుసుకుని పేదలకు వైద్య విద్యను, వైద్యాన్ని దరిచేర్చే మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో 17 మెడికల్‌ కాలేజీలను మంజూరు చేసి వాటిలో 5 మెడికల్‌ కాలేజీలను పూర్తిచేసి ప్రారంభోత్సవం చేయగా రెండు మెడికల్‌ కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. మిగిలిన 10 మెడికల్‌ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటుకు పప్పు బెల్లాల రూపంలో అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం పన్నాగాలు పన్నుతోందని ఆరోపించారు. ఎకరా స్థలాన్ని కేవలం ఏడాదికి రూ.100 కు లీజు పద్ధతిన 66 ఏళ్లు ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. ఒక్కో మెడికల్‌ కాలేజీ సుమారు 50 ఎకరాల్లో ఉంటుందని ఆ విధంగా ఒక్కో మెడికల్‌ కాలేజీ ఏడాదికి రూ.5 వేల లీజు పద్ధతిలో అందజేయటానికి పూనుకుందని, ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం మరొకటి లేదని ఘాటుగా విమర్శించారు. ఒక్కో మెడికల్‌ కాలేజీ నిర్మాణానికి సుమారు రూ.500 కోట్లు అవుతుందని ఆ ప్రకారం 17 మెడికల్‌ కాలేజీలకు రూ.8,500 కోట్లు అవుతుండగా ఇప్పటి వరకు రూ.3 వేల కోట్ల వరకు జగనన్న ఖర్చు చేశాడని మిగిలిన, రూ.5 వేల కోట్లను సంవత్సరానికి వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేసి పూర్తి చేయవచ్చని, కానీ డబ్బులు లేవని ప్రైవేటుకు అప్పగిస్తామని చెప్పటం సిగ్గుచేటన్నారు. పేదలకు వైద్యాన్ని, విద్యను దూరం చేయటంలో మంత్రి స్వామి తన వంతు పాత్ర పోషించాడని, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

వైఎస్సార్‌ సీపీ ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు మెడికల్‌ కాలేజీలను ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం పూనుకోవటాన్ని దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు అన్నారని ఇప్పుడు ప్రైవేటుకు కట్టబెడుతుంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకుందని విమర్శించారు.

పార్టీ సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ డాక్టర్‌ మాదాసి వెంకయ్య మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వ్యవస్థలను ప్రైవేటీకరించేందుకే మొగ్గు చూపుతుందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే తహశీల్దార్‌, ఎంపీడీఓ, పోలీస్‌స్టేషన్‌ లను కూడా ప్రైవేటీకరించినా ఆశ్చర్యం లేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం మెడికల్‌సీట్లు మంజూరు చేస్తానంటే వద్దు అని చెప్పిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు.

పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యుటివ్‌ మెంబర్‌ డాక్టర్‌ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరం చేసే పీపీపీ విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయటాన్ని దేశచరిత్రలో తీసుకున్న నికృష్టమైన నిర్ణయమని ఎద్దేవా చేశారు. తరువాత మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలిరోజు 500 సంతకాలను సేకరించారు. అంతకుముందు వైఎస్సార్‌, డాక్టర్‌ కోటారెడ్డి, పూనూరు వెంకారెడ్డి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు వై వెంకటేశ్వరరావు, పార్టీ అధ్యక్షులు మసనం వెంకట్రావు, బచ్చల కోటేశ్వరరావు, చింతపల్లి హరిబాబు, దుద్దుగుంట మల్లిఖార్జునరావు, కేశవరపు కృష్ణారెడ్డి, గొల్లపోతు గోవర్దన్‌, ఎంపీటీసీలు గోళ్లమూడి అశోక్‌కుమార్‌రెడ్డి, ఏపూరి శ్రీనివాసులు, అంకయ్య, బల్లెల ప్రభాకరరెడ్డి, ఎం శివారెడ్డి, బుర్ల భాస్కరరెడ్డి, పాలెపు మాధవరావు, వినోద్‌, గౌడపేరు రాఘవ, మాధవ, కుర్రు కళ్యాణ్‌, బుజ్జమ్మ, పున్నయ్య తాతయ్య, విజయ్‌, పౌల్‌, వాయిల ఆనంద్‌, ప్రభుదాసు, కాలేషా, షకీలా, ప్రమీల, ప్రళయకావేరి శివ, వీ పెద్ద యలమందయ్య, ఢాకా పిచ్చిరెడ్డి, చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, నరేందర్‌రెడ్డి, సుదర్శి వెంకట్రావు, షేక్‌ సుల్తాన్‌, చుక్కా కిరణ్‌కుమార్‌, యనమల మాధవి, కోమిట్ల వెంకారెడ్డి, చొప్పర శివ, పెరికాల సునీల్‌, షేక్‌ కరీం, సోమిశెట్టి సురేష్‌, మాదాల శంకర్‌, ప్రభాకరరెడ్డి, దాసరి శేషయ్య, భాగ్యమ్మ, నవీన్‌రెడ్డి, భాను, నాగార్జున, చిడిపోతు కృష్ణారెడ్డి, షేక్‌ నౌషాద్‌, పుట్టా వెంకట్రావు, ఎం వెంకటాద్రి రెడ్డి, బొక్కిసం సుబ్బారావు, గొట్టిపాటి మురళి, జెడ్పీటీసీ బెజవాడ వెంకటేశ్వర్లు, పిల్లి తిరుపతిరెడ్డి, తానికొండ రామచంద్రరావు, నాగినేని భాస్కర్‌, దుంపా అనిల్‌కుమార్‌రెడ్డి, పిన్నిక కమలేష్‌, నరేష్‌, సయ్యద్‌ ఆబిద్‌ అలీ, షేక్‌ అల్లాబక్షు, షేక్‌ పటేల్‌, మారంరెడ్డి గంగాధరరెడ్డి పాల్గొన్నారు.

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం1
1/1

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement