
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
త్రిపురాంతకం: బొలోరా వాహనం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మేడపి – మానేపల్లి రోడ్డులో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. త్రిపురాంతకం మండలం గణపవరానికి చెందిన మందా పేరయ్య (22), మందా కోటేష్‌లు పుల్లలచెరువు మండలం ఐటీవరంలో ఉన్న తల్లి కోటమ్మ వద్దకు వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో పేరయ్య అక్కడికక్కడే మృతి చెందగా కోటేష్ తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల పిల్లలు. బేల్దారీ పనుల నిమిత్తం గురువారం రాత్రి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ప్రమాదం జరిగింది. దీంతో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. మృతుడు పేరయ్య తండ్రి అనారోగ్యంతో రెండేళ్ల క్రితం మృతి చెందాడు. బొలోరా వాహనంలో ప్రయాణిస్తున్న ఐటీవరానికి చెందిన కొన్ని కుటుంబాలు రవ్వారంలోని గురప్పస్వామి దేవాలయానికి వెళుతూ ప్రమాదానికి గురయ్యారు. వారికి చిన్న చిన్న గాయాలయ్యాయి. సీఐ అసాన్, ఎస్సై శివబసవరాజులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మృతి చెందిన పేరయ్య కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి వారితో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
మరొకరి పరిస్థితి విషమం
మేడపి–మానేపల్లి రోడ్డులో ప్రమాదం

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి