
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమిద్దాం
● మాజీ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్
సింగరాయకొండ: కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తుందని, దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. స్థానిక పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడిక్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌పరం చేసి పేద విద్యార్థులను వైద్య విద్యకు దూరం చేసేందుకే కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నిందన్నారు. దీనికి నిరసనగా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు సంతకాలు సేకరణ, రచ్చబండ కార్యక్రమాన్ని జిల్లాలో తొలుత పాకల గ్రామంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. పేద విద్యార్థులు, పేద ప్రజల కోసం మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు పూనుకుంటే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్‌పరం చేసి సొమ్ము చేసుకునేందుకు యత్నిస్తుందని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు. పాకలలోని అభ్యుదయ కళ్యాణమండపంలో జరిగే కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై వెంకటేశ్వరరావు, సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు డాక్టర్ మాదాసి వెంకయ్య పాల్గొంటారన్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో నియోజకవర్గంలోని వివిధ విభాగాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తుల అశోక్‌కుమార్‌రెడ్డి, మండల అధ్యక్షుడు మసనం వెంకట్రావు, చొప్పర వెంకన్న, రాపూరి ప్రభావతి, నరేందర్‌రెడ్డి, షేక్ మహమ్మద్‌బాషా, షేక్ సుల్తాన్, యనమల మాధవి, చుక్కా కిరణ్‌కుమార్, దాసు శ్రీను, గొల్లపోతు గోవర్దన్, నరేష్, పటేల్, కోమట్ల వెంకారెడ్డి, గాలిబుజ్జి, బుజ్జమ్మ, పెరికాల సునీల్, కుంచాల రవి, చొప్పర శివ, షేక్ అల్లాభక్షు, సోమిశెట్టి సురేష్, రావినూతల అంకయ్య, ఎం భాగ్యలక్ష్మి, కేశవరపు నవీన్‌రెడ్డి, ఎం జెస్సిపాల్, షేక్ కరీం, మాదాల శంకర్ తదితరులు పాల్గొన్నారు.