
చట్టాలపై అవగాహన అవసరం
పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది
● ఎస్పీ హర్షవర్ధన్‌రాజు
ఒంగోలు టౌన్: కొత్త చట్టాలపై పోలీసు అధికారులంతా పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉంలని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు సూచించారు. నూతన చట్టాలకు అనుగణంగా రూపొందించిన రిజిస్టర్లను నిక్కచ్చిగా నిర్వహించడం తప్పనిసరని స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని గెలాక్సీ కాంప్లెక్స్‌లో గురువారం నూతన చట్టాలపై పోలీసు అధికారులు, పోలీస్‌స్టేషన్ల రైటర్లు, అసిస్టెంట్ రైటర్లు, టెక్నికల్ అసిస్టెంట్లకు అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డిజిటలైజేషన్, వేగవంతమైన న్యాయం లక్ష్యంగా నూతన చట్టాలను రూపొందించినట్లు వివరించారు. జీరో ఎఫ్‌ఐఆర్, ఈ ఎఫ్‌ఐఆర్‌లను సమర్ధవంతంగా అమలు చేయడంలో రికార్డులు కీలకమని చెప్పారు. అధికార పరిధితో సంబంధం లేకుండా నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్, దర్యాప్తు పురోగతి వివరాలు, ఈ సమన్స్ పంపే ప్రక్రియ, నేర దృశ్యాల వీడియో రికార్డింగ్, ఈ ఎవిడెన్స్ వంటి డిజిటల్ విధానాలకు సంబంధించిన రిజిస్టర్లు కొత్త విధానం ప్రకారం నిర్వహించాలని సూచించారు. రికార్డులన్నింటినీ ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ప్రిలిమినరీ ఎంకై ్వరీ రికార్డుల విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని చెప్పారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల దర్యాప్తును రెండు నెలల్లో పూర్తి చేయడానికి సంబంధించిన రికార్డులు పక్కాగా ఉండాలన్నారు. నేరాల దర్యాప్తు వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్త చట్టాల అమలుతో పోలీసుల జవాబుదారీతనం, పారదర్శకత మరింత పెరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ దేవప్రభాకర్, ఐటీ కోర్ సీఐ సూర్యనారాయణ, టూటౌన్ సీఐ మేడా శ్రీనివాసరావు, ఎస్సైలు పాల్గొన్నారు.

చట్టాలపై అవగాహన అవసరం