
సీసీ అవినీతిపై విజిలెన్స్ విచారణ
దొనకొండ: గతంలో సీ్త్ర శక్తి కార్యాలయంలో సీసీగా విధులు నిర్వర్తించిన ఈవీ సుచేంద్రరావు అవినీతిపై జిల్లా విజిలెన్స్ సీఐ ఎన్.ఎస్.ఎస్.అపర్ణ బుధవారం విచారణ చేపట్టారు. స్థానిక సీ్త్ర శక్తి కార్యాలయంలో గ్రూపు మహిళలు, సిబ్బందితో ఆమె మాట్లాడారు. 2016 నుంచి 2019 వరకు సీసీ సుచేంద్రరావు సుమారు రూ.13 లక్షలను ఇతర అకౌంట్లకు బదిలీ చేసి స్వాహా చేశారని కేసు నమోదైంది. ఒంగోలు డీఆర్‌డీఏ వెలుగు వారు ఈ అవినీతి కేసును జిల్లా విజిలెన్స్ సీఐ అపర్ణకు అప్పగించారు. అవినీతికి పాల్పడిన వారందరికీ ఫోన్ చేసి సీఐ మాట్లాడారు. బేతేలు గ్రామ సంఘం రూ.1.46 లక్షలు, పెద్దగుడిపాడు రూ.6.36 లక్షలు, యర్రబాలెం రూ.3.10 లక్షలు, గంగదేవిపల్లి రూ.2.48 లక్షలు, బాదాపురం రూ.35 వేలు, రాగమక్కపల్లి రూ.14,500 వేలు కలిపి మొత్తం రూ.13,89,500ను సుచేంద్రరావు తనకు అనుకూలంగా ఉన్న వారి అకౌంట్లలో జమ చేసి వారి దగ్గర నుంచి తీసుకున్నట్లు సమాచారం. అంతేగాకుండా తన కుటుంబ సభ్యులైన భార్య, తల్లి అకౌంట్లలో కూడా నగదు జమచేసినట్లు రికార్డు పూర్వకంగా రుజువైందని ఆమె తెలిపారు. దీనికి బ్యాంకు వారు కూడా సహకరించినట్లు సమాచారం. ఎవరి అకౌంట్లలో జమచేశారో వారందరిపై నేరం రుజువైతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని సీఐ హెచ్చరించారు. ముందుగా కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఆరోపణలపై వచ్చిన సిబ్బందిని పిలిపించి మాట్లాడారు. స్థానిక కెనరా బ్యాంక్‌కు వెళ్లి పూర్తి సమాచారం తీసుకున్నారు. రూ.6 లక్షలు సుచేంద్రరావు కట్టినట్టు వివరించారు. రుద్రసముద్రంలో రేషన్ షాపును తనిఖీ చేశారు. గతంలో విధులు నిర్వహించిన ఏపీఎం మాణిక్యరావు.. సుచేంద్రరావు చేసిన అవినీతిని వెలికితీసి విచారించగా అవినీతి చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే జిల్లా అధికారులకు సమాచారం ఇవ్వటంతో సుచేంద్రరావును సస్పెండ్ చేశారు