
క్యాన్సర్‌పై అవగాహన అవసరం
ఒంగోలు టౌన్: క్యాన్సర్ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని, మెరుగైన వైద్యం అందించేందుకు తోడ్పడుతుందని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ టి.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక వైద్య శాఖ కార్యాలయంలో ఆశా, ఏఎన్‌ఎంలకు బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ క్యాన్సర్ అనుమానిత కేసులను వెంటనే వైద్యాధికారికి రెఫర్ చేయాలని ఆదేశించారు. వైద్యాధికారి సదరు కేసులను జీజీహెచ్‌లోని ప్రివెంటివ్ అంకాలజీ విభాగానికి చెందిన రూం నంబర్ 222కు రెఫర్ చేయాలని సూచించారు. రొమ్ము క్యాన్సర్ అవగాహన నెలను పురస్కరించుకొని రొమ్ము క్యాన్సర్ స్వీయ పరీక్షలపై అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, కమ్యూనిటీ కేంద్రాల్లో ఆరోగ్య చర్చలు, సమావేశాలు నిర్వహించడం ద్వారా క్యాన్సర్‌పై తగిన పరిజ్ఞానాన్ని పెంపొందించాలని చెప్పారు. బ్యానర్లు, సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. ముందస్తు గుర్తింపు ప్రాణాలను కాపాడుతుందనే నినాదాలతో అవగాహనా శిబిరాలను నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో సర్వజన ఆస్పత్రి వైద్యులు భగీరథి, ఎన్‌సీడీ సీడీ నోడల్ డాక్టర్ కమలశ్రీ, డాక్టర్ నళిని, డాక్టర్ వాణిశ్రీ, హెచ్‌సీజీ క్యాన్సర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.