లోకల్ మార్కెట్‌లోనూ
అదే తీరు
రైతులకు ఆసరా కరువు
ఓ వైపు వర్షాలు మరో వైపు పంటకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అరటి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలుల ధాటికి అరటి తోటలు ఎక్కడ
నేలకొరిగిపోతాయోనని ఆందోళన
చెందుతున్న రైతులను.. పతనమైన ధరలు మరింత భయపెడుతున్నాయి. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఏడాదిపాటు శ్రమించి అరటి సాగు చేస్తే తీరా పంట
చేతికొచ్చేసరికి మార్కెట్‌లో ధర లేకపోవడంతో రైతులకు కంటి మీద కునుకు కరువైంది. వినాయక చవితి వరకు రూ.300కు పైగా పలికిన అరటి గెల ధర ప్రస్తుతం రూ.100కు అమ్ముడుపోవడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
కంభం:
జిల్లాలో సుమారు 1500 ఎకరాల్లో అరటి సాగు చేశారు. చారిత్రాత్మక కంభం చెరువు ఆయకట్టు కింద రైతులు ఎక్కువగా అరటి సాగు చేస్తారు. చెరువులో కొద్ది పాటి నీరు ఉండటంతో పంటల సాగుకు విడుదల చేయకపోయినా కేవలం బోర్ల మీద ఆధారపడి ఈ ప్రాంత రైతులు అరటి సాగు చేశారు. కంభంతోపాటు గిద్దలూరు, బేస్తవారిపేట, దోర్నాల, యరగొండపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం మండలాల్లో రైతులు అధికంగా అరటి సాగు చేస్తుంటారు. మొదటిసారి అరటి సాగు చేసిన రైతులు ఎకరాకు సుమారు లక్షన్నర రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. రెండోసారి తోట కొనసాగించిన వారు రూ.లక్ష వరకు, కౌలు రైతులు అంతకంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి కోసం ఖర్చు చేశారు.
వినాయక చవితి తర్వాత ధరలు పతనం
రైతులు ఎక్కువగా అరటిని గుంటూరు మార్కెట్ కు తరలిస్తుంటారు. వినాయక చవితి పండగకు ముందు గుంటూరులో గెల సైజును బట్టి రూ. 300కు పైగా ధర లికింది. పండుగ ముగిసిన అనంతరం రోజు రోజుకు ధరలు పడిపోయాయి. ప్రస్తుతం గెల సైజును బట్టి రూ.100 నుంచి రూ.150 లోపు పలుకుతోందని, కొన్ని సార్లు వందకన్నా తక్కువ ధర ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. గుంటూరుకు ఆటోకై తే రూ.6 వేలు, మినీ లారీకి రూ.12 వేలు బాడుగ ఖర్చవుతుందని రైతులు, కనీసం ఆ డబ్బులు కూడా చేతికొచ్చే పరిస్థితి ఉండటం లేదని చెబుతున్నారు. ఇటీవల కాలంలో గుంటూరులో మార్కెట్ లేకపోవడంతో ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్నామని, అక్కడ కూడా ఆశించిన ధర దక్కడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.
మార్కెట్‌కు తరలించేందుకు ఆటోలో ఎక్కిస్తున్న గెలలు
కోతకు సిద్దంగా ఉన్న అరటి గెలలు
స్థానికంగా కొందరు దళారులు బట్టీలు ఏర్పాటు చేసుకొని కమిషన్ వ్యాపారం చేస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లలేని రైతులు స్థానికంగా ఉండే కమీషన్ కొట్లకు అరటి గెలలను తీసుకెళ్తారు. ఒకరోజు బట్టీలో ఉంచిన అనంతరం మరుసటి రోజు తెల్లవారు జామున ఆ గెలలకు వేలం నిర్వహిస్తారు. వేలం అనంతరం వారి కమీషన్, బట్టీ కూలీ, ఆటో కూలీ తీసుకొని మిగిలిన డబ్బులు రైతులకు చెల్లిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి అరటి గెలలు వస్తుండటంతో ధరలు పూర్తిగా పడిపోయాయి. పెద్ద సైజు గెలలు కూడా వంద రూపాయలలోపే పలుకుతున్నాయి.
లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి సాగు చేసుకున్న అరటి తోటలు గడిచిన ఏడాదిన్నర వ్యవధిలో పెనుగాలుల ధాటికి నేలకొరిగిపోయి రైతులు నష్టపోయారు. పంట నష్టం వివరాలను ఉద్యానవన శాఖాధికారులు నమోదు చేసుకుని వెళ్లారేగానీ పరిహారం ఇవ్వలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో అరటికి మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
వినాయకచవితి తర్వాత పూర్తిగా పతనమైన అరటి గెలల ధరలు
గుంటూరు మార్కెట్‌లో ధరలు లేక ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న వైనం
అక్కడా అదే పరిస్థితి ఎదురవటంతో లబోదిబోమంటున్న రైతన్నలు
పండగకు ముందు రూ.300 ధర పలికిన గెల ప్రస్తుతం రూ.100
ఆరుగాలం శ్రమించినా ఆదాయం లేక అప్పులపాలవుతున్నామని ఆవేదన
ఆర్తనాదం
ఆర్తనాదం